చలికాలంలో చాలా మంది కూడా రోజుకు 4 నుండి 5 సార్లు టీని తాగుతూ ఉంటారు. అయితే ఇలా టీని ఎక్కువగా తాగడం వల్ల చలి నుండి ఉపశమనం కలిగినా కానీ మన ఆరోగ్యానికి మాత్రం ఖచ్చితంగా హాని కలుగుతుంది.అయితే మామూలు టీకి బదులుగా చలికాలంలో హెర్బల్ టీని తాగడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే హెర్బల్ టీని తాగడం వల్ల చలి నుంచి ఉపశమనం కలగడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఈ టీని తాగడం వల్ల చలికాలంలో ఎటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము.మన ఆరోగ్యానికి మేలు చేసే ఈ హెర్బల్ టీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఈ హెర్బల్ టీని తయారు చేసుకోవడం చాలా ఈజీ. దీనిని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక జార్ లో ఒక అంగుళం దాల్చిన చెక్క ముక్కను, మూడు యాలకులను, ఐదు మిరియాలు వేసి వాటిని మెత్తని పొడిగా చేసుకోవాలి.ఆ తరువాత గిన్నెలో గ్లాసున్నర నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే ముందుగా తయారు చేసుకున్న పొడితో పాటు అర టీ స్పూన్ అశ్వగంధ పొడి ఇంకా పావు టీ స్పూన్ శొంఠిపొడి వేసి10 నిమిషాల పాటు మరిగించాలి.ఆ తరువాత ఈ టీని వడకట్టి కప్పులో పోసుకుని తాగాలి.ఇలా రోజుకు ఒక కప్పు చొప్పున ఈ టీని తాగడం వల్ల మనం ఖచ్చితంగా చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.ఈ టీ ని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బాగా మెరుగుపడుతుంది. గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఈజీగా తగ్గుతాయి.


ఈ హెర్బల్ టీని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.అలాగే చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. జలుబు, దగ్గు ఇంకా గొంతునొప్పి వంటి ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. ఈ టీని రాత్రి సమయంలో తాగడం వల్ల నిద్రలేమి సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది. అలాగే చక్కగా నిద్ర పడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ టీని తాగడం వల్ల చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ టీని తాగడం వల్ల శరీరంలో చాలా ఎక్కువగా ఉండే కొవ్వు కరిగిపోతుంది. ఈ టీని తాగడం వల్ల ఒత్తిడి ఆందోళన వంటి సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి. ఈ విధంగా చలికాలంలో హెర్బల్ టీని తయారు చేసి తీసుకోవడం వల్ల చలి నుండి ఉపశమనం కలగడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: