నేటి కాలంలో అసలు వయసుతో సంబంధం లేకుండా అందరూ అధిక సమస్యతో బాధపడుతున్నారు. మారిన మన జీవన విధానం ఇంకా ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణం. వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ ఇంకా నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోవడం, కూర్చొని పని చేయడం అలాగే శరీరానికి తగినంత శ్రమ లేకపోవడం వంటి వివిధ కారణాల వల్ల చాలా మంది ఈ సమస్య బారిన పడుతున్నారు. అందుకే అధిక బరువు సమస్య నుండి వీలైనంత త్వరగా బయటపడాలి. లేదంటే ఈ సమస్య ఖచ్చితంగా తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.అధిక బరువు సమస్యతో బాధపడే వారు సులభంగా బరువు తగ్గాలంటే ఇప్పుడు చెప్పే కషాయాన్ని తయారు చేసి తీసుకోని తాగాలి. ఈ కషాయాన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా మేలు కలుగుతుంది. ఇంకా ఈ కషాయాన్ని తయారు చేయడం చాలా సులభం. బరువు తగ్గించే ఈ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఇందుకోసం ఒక గిన్నెలో ఒకటిన్నర గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి. ఇందులోనే 15 పుదీనా ఆకులు, 5 లవంగాలు, అంగుళం దాల్చిన చెక్క ముక్క, అర టీ స్పూన్ అల్లం తురుము ఇంకా 4 లేదా 5 నిమ్మకాయ ముక్కలు వేసి మరిగించాలి. ఈ నీటిని గ్లాస్ అయ్యే దాకా మరిగించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. ఆ తరువాత ఈ నీటిని వడకట్టి తీసుకోవాలి.ఇలా ప్రతి రోజూ ఒక గ్లాస్ మోతాదులో ఈ కషాయాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు పెరిగి మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే పొట్టతో పాటు ఇతర శరీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు అంతా ఈజీగా కరిగిపోతుంది. అలాగే ఈ కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా ఎలాంటి ఇన్పెక్షన్ లు దరి చేరకుండా ఉంటాయి. అలాగే శరీరంలో మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. ఈ కషాయాన్ని తాగడం వల్ల ఒత్తిడి ఇంకా ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. ఈ విధంగా ఇంట్లోనే చాలా ఈజీగా ఈ కషాయాన్ని చేసి తీసుకోవడం వల్ల మనం బరువు తగ్గడంతో పాటు ఇంకా ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. .

మరింత సమాచారం తెలుసుకోండి: