ఈ రోజుల్లో బాగా వేగంగా పెరుగుతున్న వ్యాధుల్లో థైరాయిడ్ అనేది తీవ్రమైన సమస్యగా మారింది. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, గత 10 సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి.ఈ వ్యాధి 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మహిళల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది.తప్పుడు ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో వస్తున్న విపరీతమైన మార్పుల వల్ల ఇలా జరుగుతోందని డాక్టర్లు చెబుతున్నారు. శరీరంలో ఉండే థైరాయిడ్ గ్రంధి పనితీరు తగ్గడం వల్ల ఈ థైరాయిడ్ వ్యాధి వస్తుంది. ఆయుర్వేద చికిత్సలతో థైరాయిడ్ వ్యాధిని నియంత్రించవచ్చని ఆరోగ్య వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని కోసం కొన్ని ఆయుర్వేద టిప్స్ ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఆహార పదార్ధాలు తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్యకు చాలా ఈజీగా చెక్ చెప్పవచ్చు.ఈ వ్యాధి తగ్గాలంటే ఖచ్చితంగా కలబందను తినాలి.తాజా కలబందను తినడం వల్ల థైరాయిడ్ సమస్యలు ఈజీగా అదుపులో ఉంటాయి. ఇది వాత- కఫా రెండింటినీ కూడా సమతుల్యం చేస్తుంది.అలాగే ఇది శరీరంలో థైరాయిడ్ వ్యాధిని నియంత్రించడంలో కూడా బాగా సహాయపడుతుంది.ఇంకా థైరాయిడ్ వ్యాధిని నియంత్రించడంలో కొత్తిమీర కూడా చాలా బాగా మేలు చేస్తుంది. అలాగే కొత్తిమీరతో పాటు జీలకర్ర కూడా తీసుకోవాలి.


 ఇందుకోసం, కొత్తిమీర – జీలకర్రను రాత్రంతా నీటిలో  నానబెట్టండి. తరువాత ఈ నీటిని ఉదయాన్నే వడపోసి ఖాళీ కడుపుతో త్రాగాలి. ఇది థైరాయిడ్ వ్యాధిని నియంత్రించడంలో చాలా బాగా సహాయపడుతుంది.ప్రతిరోజూ ఉదయం పూట నడవడం వల్ల శరీరంలో ఆక్సిజన్‌ ప్రసరణ పెరుగుతుంది. ఇది థైరాయిడ్‌ను నియంత్రించడంలో చాలా బాగా సహాయపడుతుంది. మీరు ప్రతిరోజూ  ఉదయం 15 నుంచి 20 నిమిషాలు ఖచ్చితంగా నడవాలి. నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.అలాగే కపాలభాతి చేయడం వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది. మీరు ఈ ప్రాణాయామం ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా కూడా చేయవచ్చు. ఇది థైరాయిడ్ హార్మోన్ పనితీరును బాగా మెరుగుపరుస్తుంది. అయితే ఈ కపాలభాతి ప్రతిరోజూ 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే చేయాలి.మన శరీరంలో ఉండే థైరాయిడ్ గ్రంధి పనితీరు తగ్గినప్పుడు, థైరాయిడ్ వ్యాధి వస్తుంది. అయితే ప్రస్తుతం ఈ వ్యాధి మహిళల్లో చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఈ థైరాయిడ్ గ్రంధి పనితీరు తగ్గడమే కాకుండా, ఆహారంలో అయోడిన్ లేకపోవడం వల్ల కూడా ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. అలాంటి పరిస్థితిలో ఖచ్చితంగా అయోడిన్ లోపం ఉండకుండా చూసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: