అధిక బరువు తగ్గాలనుకునే వారు ఖచ్చితంగా మన శరీరంలో జీవక్రియల రేటు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇక మనం కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల మన శరీరంలో జీవక్రియ రేటును మెరుగుపరుచుకోవచ్చు. శరీరంలో జీవక్రియను మెరుగుపరిచే ఆహారాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. జీవక్రియను మెరుగుపరచడంలో మిరపకాయలు చాలా బాగా సహాయపడతాయి. మనం మిరపకాయలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియల వేగం ఈజీగా పెరుగుతుంది.క్యాలరీలు కూడా వేగంగా ఖర్చు అవుతాయి. ఇంకా అలాగే శరీరంలో జీవక్రియల వేగాన్ని పెంచడంలో గ్రీన్ టీ మనకు ఎంతగానో సహాయపడుతుంది. ప్రతి రోజూ ఒక కప్పు గ్రీన్ టీని తాగడం వల్ల శరీరంలో జీవక్రియల వేగం పెరిగి మనం సులభంగా బరువు తగ్గుతాము. ఇంకా అలాగే రోజంతా ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము. అదే విధంగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా శరీరంలో జీవక్రియల వేగం అనేది పెరుగుతుంది.అందుకు క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి.


చిక్కుళ్లు, బీన్స్, రాజ్మా, చికెన్, గుమ్మడి విత్తనాలు, పొద్దు తిరుగుడు గింజలు ఇంకా పల్లీలు వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల తగినంత శరీరానికి తగినంత ప్రోటీన్ అనేది లభిస్తుంది.అందువల్ల జీవక్రియల వేగం పెరుగుతుంది. ఇంకా అలాగే నిమ్మజాతికి చెందిన పండ్లను తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల వ్యాయామం చేసేటప్పుడు క్యాలరీలు అనేవి ఎక్కువగా ఖర్చు అవుతాయి.ఇంకా అలాగే ఓట్స్ ను తీసుకోవడం వల్ల కూడా శరీరంలో జీవక్రియల వేగం పెరుగుతుంది. ఓట్స్ ను ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ విధంగా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియల వేగం పెరిగి క్యాలరీలు కూడా ఎక్కువగా ఖర్చు అవుతాయి. అందువల్ల మనం సులభంగా వేగంగా బరువు తగ్గవచ్చు.కాబట్టి ఖచ్చితంగా పైన తెలిపిన టిప్స్ పాటించండి. అధిక బరువు సమస్యని ఈజీగా తగ్గించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: