నేటి కాలంలో చాలా మంది కూడా శ్వాస సంబంధిత సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు. ముఖ్యంగా వాతావరణ కాలుష్యం, దుమ్ము, ధూళి, పొగ త్రాగటం వంటి వివిధ కారణాల వల్ల ఊపిరితిత్తులల్లో వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోతున్నాయి. అందువల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుంది. దీని వల్ల చాలా మంది దగ్గు, జలుబు వంటి వాటితో పాటు వివిధ రకాల శ్వాస సంబంధిత సమస్యలతో బాగా బాధపడుతున్నారు. అలాగే శ్వాస సంబంధిత సమస్యలతో మరణించే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. అయితే ఇలాంటి సమస్యలు మన దరి చేరకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి.ఎందుకంటే ఊపిరితిత్తులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. దీని కోసం మనం ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు వాటిని శుభ్రపరిచే ఆహారాలను ఖచ్చితంగా తీసుకోవాలి.ఇక వీటిని తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.ఇంకా శ్వాస సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.  పసుపును తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.


అలాగే వాతావరణ కాలుష్యం కారణంగా ఊపిరితిత్తులకు ఎటువంటి నష్టం కలగకుండా చేయడంలో పసుపు మనకు ఎంతో దోహపడుతుంది. ఇంకా అలాగే స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ బెర్రీ వంటి పండ్లను తీసుకోవడం వల్ల కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎందుకంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ నుండి ఊపిరితిత్తులను కాపాడడంలో బాగా సహాయపడతాయి.ఇంకా అలాగే విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉండే పాలకూరను తీసుకోవడం వల్ల కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇంకా అదే విధంగా యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే వెల్లుల్లిని తీసుకోవడం వల్ల కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. వాతవరణ కాలుష్యం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు రాకుండా చేయడంలో వెల్లుల్లి మనకు ఉపయోగపడుతుంది. అలాగే అల్లాన్ని ఉపయోగించడం వల్ల కూడా మనం ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. ఇంకా అదే విధంగా రోజూ ఒక కప్పు గ్రీన్ టీని తాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: