ఈ రోజుల్లో చాలా కారణాల వల్ల అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. ఈ అధిక రక్తపోటు సమస్యను ఏమాత్రం కూడా తేలికగా తీసుకోకూడదు. అధిక రక్తపోటు సమస్య సైలెంట్ కిల్లర్ లాగా మన శరీర ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. దీని వల్ల బ్రెయిన్ స్ట్రోక్, గుండె సంబంధిత సమస్యలు ఇంకా అలాగే మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు ఇలా చాలా రకాల సమస్యలు మనల్ని చుట్టుముడతాయి.ఈ అధిక రక్తపోటు కారణంగా కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుంది.కాబట్టి ఈ సమస్య బారిన పడిన వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.మనం మందులు వాడుతూనే అధిక రక్తపోటును అదుపులో ఉంచే ఆహారాలను కూడా తీసుకోవాలి.ఎందుకంటే దీని వల్ల రక్తపోటు క్రమంగా తగ్గుతుంది. ఇంకా అలాగే లేని వారికి ఈ సమస్య రాకుండా ఉంటుంది. అధిక రక్తపోటును తగ్గించే ఆహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారు ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. మనం ఆకుకూరలను తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి. ఇంకా స్మూతీ రూపంలో లేదా సలాడ్ రూపంలో వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇంకా అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ ఇంకా రాస్ బెర్రీ వంటి పండ్లను తీసుకోవాలి.ఎందుకంటే ఇవి రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడతాయి. ఇంకా అలాగే రక్తపోటుతో బాధపడే వారు ఓట్స్ ను ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఓట్స్ ను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంకా అలాగే అరటి పండ్లను కూడా ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే అధిక రక్తపోటుతో బాధపడే వారు రోజుకు ఒక అరటి పండును తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల దీనిలో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.ఇంకా అదే విధంగా వారానికి రెండు సార్లు చేపలను తీసుకునే ప్రయత్నం చేయాలి. చేపలను తీసుకోవడం వల్ల రక్తపోటు ఈజీగా తగ్గుతుంది.ఇంకా అలాగే ఆహారంలో భాగంగా వెల్లుల్లిని తీసుకోవాలి. ఎందుకంటే దీనిలో ఉండే అల్లిసిన్ అనే రసాయన సమ్మేళనం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: