ప్రోటీన్ పౌడర్లను ఎక్కువగా వ్యాయామం చేసేవారు ఉపయోగిస్తారు.మన శరీర ఆరోగ్యానికి విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు, ముఖ్యంగా ప్రోటీన్లు చాలా అవసరం.శరీరంలో ఏర్పడే ప్రొటీన్‌ లోపం వల్ల రకరకాల వ్యాధులు వస్తాయి. ఇలాంటి సమయంలో ప్రొటీన్ లోపాన్ని అధిగమించేందుకు చాలా మంది ప్రొటీన్ పౌడర్ ఎక్కువగా తీసుకుంటారు. కానీ ప్రతిరోజూ ప్రొటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ఖచ్చితంగా చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. అందుకే మీరు కూడా ప్రోటీన్ పౌడర్ వాడుతున్నట్లయితే దాని ప్రమాదాలను తెలుసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఇక చక్కెరను తరచుగా ప్రోటీన్ పౌడర్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇది ఇన్సులిన్ వేగాన్ని ఖచ్చితంగా పెంచుతుంది.అలాగే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. పైగా దీనివల్ల డయాబెటిస్ రిస్క్ కూడా పెరుగుతుంది.ఈ ప్రోటీన్ పౌడర్లలో చాలా రకాలు ఉన్నాయి. వీటిలో రుచి కోసం స్వీటెనర్లు ఇంకా రంగులు కలుపుతారు. ఇది ఆరోగ్యంపై ఖచ్చితంగా చెడు ప్రభావం చూపుతుంది.


ఇక స్వీటెనర్లు, రంగులు ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను దెబ్బతీస్తాయి. అందువల్ల జీర్ణ సమస్యలు సంభవించవచ్చు. అయితే ఈ ప్రొటీన్ పౌడర్ వల్ల కొంతమంది బరువు తగ్గుతారు.అలాగే ప్రొటీన్లు ఎక్కువగా తింటే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రొటీన్లు ఎక్కువగా ఉంటే యూరినరీ కాల్షియం విసర్జించడం, మూత్ర విసర్జన ఎక్కువగా రావడం, కిడ్నీ పనితీరు దెబ్బతినడం ఇంకా కిడ్నీలో రాళ్లు ఏర్పడడం వంటి సమస్యలు ఎదురవుతాయి.ఇంకా అంతేకాకుండా క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.అలాగే కొన్ని రకాల ప్రొటీన్ పౌడర్లు సోయా ఆధారితవి. మనం తెలియకుండా వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది చాలా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. సోయాలో అమినో యాసిడ్స్ ఇంకా ఫైటోఈస్ట్రోజెన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి అలసట, కోరిక తగ్గడం ఇంకా రొమ్ము పరిమాణంలో మార్పులకు కారణమవుతాయి. కాబట్టి ఈ ప్రొటీన్ పౌడర్ తీసుకునే ముందు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: