వాల్ నట్స్ లో ప్రొటీన్,కాల్షియం,మెగ్నీషియం,ఐరన్, ఫాస్పరస్,కాపర్,సెలీనియం,జింక్,ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
మతిమరుపు..
సాధారణంగా వయసు పెరిగే కొద్దీ చాలామందికి మతిమరుపు వస్తూ ఉంటుంది.అలా మతిమరుపు రాకుండా ఉండాలి అంటే రోజుకో రెండు వాల్నట్స్ తినడం వల్ల ఇందులోని కాపర్ మరియు జింక్ జ్ఞాపకశక్తిని పెంచుతుంది.అంతేకాక పిల్లలకు వీటిని ఇవ్వడం వల్ల వారి మెదడు మరింత మెరుగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
జుట్టు సమస్యలు..
చాలామందికి ఒక్కొక్కసారి చాలా చాలా జుట్టు ఊడిపోతూ ఉంటుంది.అంతేకాక చుండ్రు,జుట్టు చిట్లిపోవడం వంటి సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు.అలాంటి సమస్యలన్నింటికీ వాల్నట్స్ చెక్ పెడుతుంది.ఇందులోని బయోటిన్ జుట్టు సమస్యలను రాకుండా కాపాడుతాయి.
గుండెపోటు..
ఈ మధ్యకాలంలో చాలామంది గుండెపోటుతో ఆకారణంగా చనిపోతూ ఉన్నారు.అలా కాకుండా ఉండాలి అంటే రోజుకో రెండు వాల్నట్స్ తీసుకోవడం మంచిది.ఇందులోనే మెగ్నీషియం మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె సమస్యలు దూరం కావడంలో సహాయపడతాయి.
రక్తహీనత..
శరీరంలో రక్త కణాలు వృద్ధి చెందక చాలామంది రక్తహీనత బారిన పడుతూ ఉంటారు.అలాంటి వారికి ఇందులో పుష్కలంగా లభించే ఐరన్ కంటెంట్ కొత్త రక్త కణాలు వృద్ధి చెందేందుకు దోహదపడుతుంది.
ప్రోటీన్ లోపం..
చాలామంది చిన్న పిల్లల్లో ప్రోటీన్ లోపం వల్ల చాలా నీరసంతోగా తయారవుతూ ఉంటారు.అలాంటి వారికి చాలా బాగా ఉపయోగపడతాయి.ఇందులోని ప్రోటీన్ శరీరానికి అవసరమైన శక్తిని మొత్తం సరఫరా చేస్తుంది.
కావున మీరు కూడా పైన చెప్పిన సమస్యలు దూరంగా ఉండాలి అంటే వెంటనే వాల్నట్స్ తినడం ప్రారంభించండి.