కొంతమందికి మానసికంగా,ఆర్థికంగా,శారీరకంగా ఎలాంటి సమస్యలు లేకపోయినప్పటికీ వివాహం మాత్రం లేట్ అవుతూ ఉంటుంది.ఇంకా కొంతమందికి అయితే వివాహం పీటలు దాకా వచ్చి ఆగిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి.దానికి వారి నుంచి ఎలాంటి పొరపాట్లు జరగకపోయినా కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.అలాంటి వారి కోసం ధనుర్మాసంలో కొన్ని రకాల పూజలు చేయడం వల్ల, వెంటనే పెళ్లిళ్లు ఫిక్స్ అవుతాయని వేద పండితులు చెబుతున్నారు.కార్తీక మాసం ఎంత పవిత్రమైనదో ధనుర్మాసం కూడా అంతే పవిత్రమైనది అని కూడా చెబుతున్నారు.ధనుర్మాసంలో పెళ్లి కాని వారు చేయాల్సిన పనులేంటో,పూజలేంటో మనము తెలుసుకుందాం పదండి..

ఈ పూజ కోసం ముందుగా విష్ణుమూర్తి సమేత గోదా దేవి ఉన్న ఫోటోను ఉంచుకోవాలి.ఈ మాసంలో పూజ చేయాలి అనుకునేవారు ఆ రోజున తెల్లవారుజామున సూర్యోదయం కంటే ముందు పూజను నిర్వహించాలి. ఈ పూజను నిర్వహించేటప్పుడు ప్రతి ఒక్కరూ తెల్లని వస్తానని ధరించి,ఆర్భాటాలకు దూరంగా ఉండాలి. ఇప్పుడు తెల్లవారుజామునే లేచి,ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని,తలారా తల స్నానం చేయాలి.ఈ సమయంలో ఎలాంటి చెడు ఆలోచనలు కానీ,చెడు మాటలు కానీ అస్సలు మాట్లాడకూడదు.ఇప్పుడు తెల్లని వస్త్రం తీసుకొని ఒక పీటపై పరిచి,ఆ వస్త్రం పై పసుపు కుంకుమ వేసి విష్ణుమూర్తిని గోదాదేవి ఉన్న ఫోటోలను ఉంచి పూజించాలి.ఈ సమయంలో విష్ణు సహస్రనామాలు,లలితా సహస్రనామాలను జపించాలి. ఇలా 41 రోజులపాటు చేయడం వల్ల,పూజించడం వల్ల వివాహం కాని వారికి వెంటనే వివాహ సంబంధాలు వచ్చి వారికివివాహం జరుగుతుంది.

 అంతేకాక ఇలా పూజలు నిర్వహించడం వల్ల ఆర్థిక సమస్యలు,కటిక పేదరికం వంటి సమస్యలు కూడా తొందరగా తొలగిపోతాయి.ఈ సమయంలో పాటించాల్సిన నియమాలలో చెడు మాటలు మాట్లాడకపోవడం,సాత్వికాహారాన్ని తీసుకోవడం, కుళ్లు కుతంత్రాలు చేయకపోవడం,అనవసరమైన వస్త్రాభరణాలకు దూరంగా ఉండడం వంటివి చేయాలి.మరియు ప్రతి ఒక్కరూ కుంకుమ ధారణ తప్పనిసరి.అంతేకాక ఈ మాసంలో ఈ పూజలు నిర్వహించడం వల్ల అనంతమైన పుణ్యం కూడా లభిస్తుంది.కావున ప్రతి ఒక్కరూ ఈ మాసాన్ని సద్వినియోగం చేసుకోవడం  చాలా ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: