![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/health/movies_news/teeth-cleaningeb336c91-53cd-4e0c-a654-21bd4def001e-415x250.jpg)
ఉప్పు..
వారానికి రెండు నుంచి మూడుసార్లు ఉప్పు మరియు ఆవనూనెతో కలిపి బ్రష్ చేయడం వల్ల పళ్లపై పాచి పర్మనెంట్ గా పోతుంది.ఇది ఇది చూడటానికి పాతకాలం పద్ధతి అయినప్పటికీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది.
జామాకులు..
జామ ఆకులను బాగా ఎండబెట్టి పొడి లాగా చేసుకుని ఉప్పు కలిపి బ్రష్ చేసుకోవడం వల్ల, పళ్ళపై ఎలాంటి మరకలు ఉన్నప్పటికీ వెంటనే తొలగిపోతాయి.అంతేకాక ఇందులో ఉన్న విటమిన్ సి చిగుళ్ళను దృఢపరిచి, దంత ఆరోగ్యాన్ని పెంచుతుంది.
నారింజ తొక్క..
వీటిని వాడటం దంతాలను తెల్లగా మార్చడానికి ఒక మంచి మార్గం అని చెప్పవచ్చు.రోజూ ఉదయాన్నే నారింజ తొక్కతో పళ్ళు తోముకోవాలి.దీనితో దంతాలను తెల్లగా మరియు బలంగా మారుతాయి.మరియు ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటి దుర్వాసనలు పోగొట్టమే కాకుండా ఎలాంటి దంత సమస్యలు ఉన్నా తొందరగా తొలగిపోతాయి.
నిమ్మకాయ..
మెరిసే దంతాలు కోసం నిమ్మకాయకు మించిన ప్రత్యామ్నాయం లేదని చెప్పవచ్చు.దీని కోసం చిటికెడు ఉప్పు,కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి బ్రష్ చేయడం తో దంతాలు తెల్లగా మారుతాయి.
కావున మీరు కూడా మీ దంతాలు మెరిపించాలంటే పైన పదార్థాలతో రోజు బ్రష్ చేయడం అలవాటు చేసుకోండి.