ముందుగా గుప్పెడు జామకులను తీసుకొని శుభ్రం చేసి, మెత్తని పేస్ట్ లాగా తయారుచేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ పై ఒక బాండీ పెట్టి,అరకప్పు కొబ్బరి నూనె వేసి,ఇందులో చిటికెడు మెంతులు,రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్,జామ ఆకుల పేస్టు వేసి బాగా ఉడకనివ్వాలి.ఇది బాగా ఉడికిన తర్వాత స్ట్రైనర్ తో వడకట్టుకోవాలి.ఇలా వచ్చిన నూనెను తల స్నానం చేయడానికి రెండు గంటల ముందు బాగా మాడుకు అప్లై చేసి ఆరనివ్వాలి.ఆ తరువాత ఒక మైల్డ్ షాంపూ తో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.ఇది బాగా శుభ్రం చేసిన తర్వాత హెయిర్ మాయిశ్చరైసర్ని రాయడం మాత్రం తప్పనిసరి.ఇలా మొదటి వాష్ లోనే మొత్తం చుండ్రు శుభ్రమైపోతుంది. చుండ్రు మళ్ళీ రాకుండా ఉండాలి అంటే,ఈ నూనె వారానికి రెండు నుంచి మూడుసార్లు అప్లై చేసి,ఈ విధంగా వాష్ చేయడం అలవాటు చేసుకోవడం ఉత్తమం.
జామకులోని విటమిన్ సి మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.దీనితో చుండ్రు దురద,జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు కూడా తొందరగా తగ్గిపోతాయి.దీనితో పాటు హార్మోనల్ ఇంబాలన్సుని కూడా బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ముఖ్యం.కావున మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉంటే వెంటనే ఈ చిట్కా వాడి చూడండి.