మలబద్ధకం అనేది చిన్న సమస్యగానే అయినా దీన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఖచ్చితంగా చాలా జబ్బులు తలెత్తుతాయి.అందుకే ఖచ్చితంగా మలబద్ధకాన్ని తగ్గించుకోవాలి. ఇక ఇప్పుడు చెప్పబోయే డ్రింక్స్ ఈ సమస్యని తగ్గించుకునేందుకు బాగా సహాయపడతాయి.ప్రతి రోజు ఈ డ్రింక్స్ ను తీసుకుంటే మలబద్ధకం దూరం అవ్వడమే కాకుండా ఎన్నో ఆరోగ్య లాభాలని కూడా పొందవచ్చు. మరి ఇంతకీ ఆ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.డ్రై ఆప్రికాట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థను చురుగ్గా మార్చడానికి డ్రై ఆప్రికాట్స్ ఎంతగానో హెల్ప్ చేస్తాయి. రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాసు నీటిలో రెండు లేదా మూడు డ్రై ఆప్రికాట్స్ నానబెట్టుకోవాలి. మరుసటి రోజు పొద్దున్నే ఆ వాటర్ తో పాటు డ్రై ఆప్రికాట్స్ ను కూడా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మలబద్ధకం ఈజీగా దూరం అవుతుంది. ఇంకా రక్తహీనత ఉంటే తగ్గుముఖం పడుతుంది. ఎముకలు కూడా చాలా బలోపేతం అవుతాయి.ఇంకా మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి చియా సీడ్స్ కూడా చాలా రకాలుగా మేలు చేస్తాయి. అందుకే ఉదయాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసి నానబెట్టి తీసుకోవాలి.


ఎందుకంటే ఈ చియా సీడ్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగు కదలికలను ఈజీగా మెరుగుపరుస్తుంది. మలబద్దకాన్ని సులభంగా తరిమి కొడుతుంది. పైగా చియా సీడ్స్ ను తీసుకోవడం వల్ల బరువు కూడా చాలా ఈజీగా తగ్గుతారు. ఇంకా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.అలాగే మలబద్ధకం సమస్య ఉన్నవారికి కిస్ మిస్ వాటర్ కూడా బాగా హెల్ప్ చేస్తాయి. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ వాటర్ లో పది కిస్ మిస్ లని వేసి వాటిని నానబెట్టి ఉదయాన్నే వాటర్ తో సహా వాటిని తీసుకోవాలి. ఇక ఇలా చేయడం వల్ల కేవలం మలబద్ధకం మాత్రమే కాదు గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తకుండా ఉంటాయి.అలాగే మెంతులు కూడా జీర్ణక్రియ ఆరోగ్యానికి సహాయపడతాయి. మెంతులు మరిగించిన నీటిని ఉదయాన్నే తాగడం వల్ల మలబద్ధకం నుంచి విముక్తి లభిస్తుంది. అదే సమయంలో కొలెస్ట్రాల్ కూడా ఈజీగా కరుగుతుంది. గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే జుట్టు రాలడం తగ్గుతుంది.కంటి చూపు కూడా మెరుపు పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: