![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/health/movies_news/lung-healtha5134989-3f1f-4eb8-8414-5eba6d2ab4d9-415x250.jpg)
దీని కోసం లిల్లీ పూలను 100 గ్రామ్స్ చొప్పున తీసుకొని బాగా ఎండబెట్టుకోవాలి.ఇలా ఎండబెట్టిన లిల్లీ పూలతో రెండు టేబుల్ స్పూన్ల మిరియాలు కలిపి మెత్తని మిశ్రమంలో పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి.ఇలా ఊపిరితిత్తుల్లో గడ్డకట్టిన కఫంతో బాధపడేవారు,రోజు చిటికెడు పైన చెప్పిన మిశ్రమాన్ని తీసుకొని,ఒక స్ఫూన్ తేనె కలిపి చిన్న గోళీల తయారు చేసి తినాలి.ఇలా పది రోజుల పాటు చేయడం వల్ల లంగ్స్ లో పేరుకుపోయిన కఫం మెల్ల మెల్లగా కరిగి,ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.
దీర్ఘకాలికంగా దగ్గు,జలుబుతో బాధపడే వారికి కూడా ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది.ఇందులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు బ్యాక్టీరియా మరియు ఫంగస్ కలిగించే జబ్బులను దూరంగా ఉంచడంలో చాలా బాగా సహాయపడుతుంది.మరియు మిరియాలలోని సుగుణాలు, తేనే ఊపిరితిత్తులలోని ఉన్న చమ్మను తీసివేయడమే కాకుండా,రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి.ఆస్తమా రోగులకు సైతం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఇలాంటి సమస్యతో బాధపడేవారు చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం.బయటికి వెళ్లేటప్పుడు స్వెటర్,మఫ్లర్ వంటివి ధరించడం చాలా మంచిది.మరియు వేడి ఆహారం,వేడి నీరు తాగడం అలవాటు చేసుకోవాలి.మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉంటే వెంటనే ఈ చిట్కా పాటించి చూడండి.