ఆరెంజ్..
చలికాలం మొదలైంది అంటే చాలు ఆరెంజ్ లు తెగ కనిపిస్తూ ఉంటాయి.వీటిని రోజుకొకటి తీసుకోవడం వల్ల ఇందులోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా,అజీర్తి,మలబద్ధకం,గ్యాస్ వంటి సమస్యలను కూడా తొలగిస్తుంది.
బొప్పాయి..
బొప్పాయి లో విటమిన్ ఏ మరియు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.వీటిని తరచూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి,కరోనా వంటి రోగాలను దరిచేరకుండా కాపాడుతుంది.
దానిమ్మ గింజలు..
దానిమ్మ గింజలలోని సి మరియు ఐరన్ కంటెంట్ పుష్కలంగా లభించడంతో రక్తహీనత తగ్గడమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.వీటితో కరోనా మహమ్మారి బారిన పడకుండా శరీరాన్ని మనం కాపాడుకోవచ్చు.
పైనాపిల్..
పైనాపిల్ రోజుకు ఒక కప్పు చొప్పున మాత్రమే తీసుకోవాలి.ఈ పండు విటమిన్ సి కి పుట్టినిల్లు అని చెప్పవచ్చు.మరియు ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎటువంటి రోగాలను దరిచేరకుండా కాపాడుతుంది.
కివి..
రోజుకు ఒక కివి పండును తీసుకోవడం వల్ల ఇందులోని పొటాషియం మెగ్నీషియం,పైబర్ మరియు విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి.వీటితో రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటి రోగాలను దారిదాపుల్లో లేకుండా తరిమి కొడుతుంది.
కావున ప్రతి ఒక్కరూ రోజుకు పైన చెప్పిన పండ్లలో ఏదో ఒక పండు తీసుకోవడం చాలా మంచిది.మరియు కరోనా నియమాలను పాటించడం కూడా చాలా ముఖ్యం.