సాధారణంగా బరువు తగ్గాలంటే వ్యాయామాలు, జాగింగులు,నడకలు మొదలు పెట్టాలని ముందుగా ఆలోచిస్తారు.కానీ ముందు వంటగదిలో తగిన మరియు కావాల్సిన వస్తువులను,పదార్థలను మాత్రమే ఉంచుకోవాలని,మిగతావి పక్కన పెట్టాలని పరిశోదకులు చెబుతున్నారు.దీని వల్ల ఏంటి లాభం అని మీకు సందేహం కలగవచ్చు.అందులోనే అసలైన కారకాలు వున్నాయిని సూచిస్తున్నారు.కానీ వంటగదిలోని అస్సలు ఎలాంటి వస్తువులు అధిక బరువుకు కారణమావుతాయో తెలుసుకుందాం పదండీ..

అల్యూమినియం పాత్రలు..

చాలామంది అల్యూమినియం కుక్కర్లు,వంట పాత్రలు మరియు నాన్ స్టిక్ పాన్స్ వాడుతూ ఉంటాము.కానీ వీటి వల్ల మన శరీరం అధిక బరువుకు కూడా గురవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.అంతేకాక ఈ పాత్రలో చేసిన వంటలు ఎక్కువ కాలం పాటు తినడంతో దీర్ఘకాలిక రోగాలైన గుండెలో మంట,మధుమేహం, కాన్సర్ చుట్టూ ముడుతాయి.కావున వాటిని బదులుగా స్టీల్ పాత్రలు ఉపయోగించడం చాలా మంచిది.

పెద్ద పెద్ద ప్లేట్లు..

ఇది వినడానికి హాస్యంగా ఉన్న పెద్ద పెద్ద ప్లేట్ లో ఉండడం వల్ల,ఆ కంచం నిండా ఆహారం పెట్టుకుని తినడం అలవాటు చేసుకుంటాము.దాని వల్ల కూడా అధిక బరువు పెరుగుతామట.కావున ప్రతి ఒకరు పెద్దపెద్ద కంచాల బదులుగా,చిన్న చిన్న కంచాలను తీసుకొని,కొంచెం కొంచెం ఆహారం తినడం అలవాటు చేసుకోవడం ఉత్తమం.

అధిక చక్కెరలు ఉన్న ఆహారాలు..

అధికంగా తీపి పదార్థాలను వంట గదిలో స్టోర్ చేసుకోవడం మన పద్ధతి.కానీ వాటిని తరచూ చూడడం వల్ల తినాలని కోరిక పెరగడంతో తినాల్సి వస్తుంది కావున ఆ సమయంలో కూడా బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

అధిక జంక్ ఉన్న స్నాక్స్..

చాలామంది స్నాక్స్ పదేపదే బయటికి ఎక్కడికి వెళ్లి కొనుక్కుంటామని,తెచ్చినప్పుడే ఎక్కువ తెచ్చిపెట్టి స్టోర్ చేసుకుంటూ ఉంటారు.ఆ స్నాక్స్ చూస్తున్నప్పుడు కూడా తినాలానే కోరిక కలుగుతుంది.దానితో కూడా బరువు పెరుగుతాము.కావున వీటికి బదులుగా డ్రై ఫ్రూట్స్, చిరుదాన్యాలుతో తయారుచేసిన స్నాక్స్ ఉంచుకోవడం ఉత్తమం.

మీరు కూడా బరువు తగ్గాలనుకుంటున్నారా..అయితే వెంటనే తగిన డైట్ ని చేస్తూ,ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి.

మరింత సమాచారం తెలుసుకోండి: