సాధారణంగా విటమిన్ డి సూర్య రశ్మి వల్ల కలుగుతుంది.విటమిన్ డి మన శరీరంలో ఉండడం కావలసినంత ఉండటం వల్ల,మనం తిన్న ఆహారం నుంచి కాల్షియం సరిగా గ్రహించబడుతుంది.లేదంటే చాలా మంది కాల్షియం డెఫిషియన్సీని ఎదుర్కోవాల్సి వస్తుంది.ఈ విటమిన్ డి పొందాలంటే కచ్చితంగా ఉదయం 8 గంటల లోపు, సాయంత్రం 6 గంటల సమయంలో సూర్యరష్మి తగిలేలా వాకింగ్ కానీ,జాగింగ్ కానీ చేయడం చాలా మంచిది.ఇప్పుడు ఉన్న జీవనశైలి కారణంగా చాలామందికి ఎండలో తిరిగే అవకాశం లేకుండా పోతొంది.దీనివల్ల వారు విటమిన్ డీ లోపాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.అలా ఎండలో విటమిన్ డి పొందలేని వారు కొన్ని రకాల డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వల్ల,విటమిన్ డి పొందవచ్చు అని ఆహార నిపుణులు చెబుతున్నారు.అసలు విటమిన్ డి అందించే డ్రై ఫ్రూట్స్ ఎంటో చూద్దామా..

ఎండుద్రాక్ష..

ఎండు ద్రాక్షలో కాల్షియం,విటమిన్ డి ,ఫాస్పరస్ పుష్కలంగా లభిస్తాయి.వీటిని తీపి పదార్థాలకు బదులుగా తినవచ్చు.వీటిని తరచూ తీసుకోవడంతో విటమిన్ డి పొందడమే కాక రోగనిరోధక శక్తిని బలోపేతంచేసుకోవచ్చు.మరియు తక్కువ ఖర్చు కూడా.

ఆప్రికాట్లు..

ఎండబెట్టిన ఆప్రికాట్లు రోజుకు నాలుగైదు తీసుకోవడం వల్ల ,ఇందులోని విటమిన్ ఎ, పొటాషియం,విటమిన్ డి,డైటరీ ఫైబర్ వంటి అనేక పోషకాలకు పుష్కళంగా లభిస్తాయి.100 గ్రాముల ఎండిన ఆప్రికాట్‌లో సుమారుగా 400 mg కాల్షియం లభిస్తుంది.

ప్లమ్స్..

వీటినే ప్రూనే అంటారు.వీటిని తరుచూ తీసుకోవడంతో జీర్ణక్రియ ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో విటమిన్ కె,పొటాషియంతో పాటు విటమిన్ డి పుష్కళంగా లభిస్తుంది.ఈ ప్రూనే చాలా విటమిన్లు , ఖనిజాలను కలిగి ఉన్నందున ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్ గ చెప్పవచ్చు.

బాదాం..

బాదాంలో విటమిన్ డి మరియు విటమిన్ ఈ,కే పుష్కలంగా లభిస్తాయి.కావున వీటిని రోజుకు ఐదు నుంచి ఆరు వరకు తీసుకోవడం చాలా ఉత్తమం.

అత్తి పండ్లను..

ఎండిన అత్తి పండ్లలో మితమైన విటమిన్ డి లభిస్తుంది. వీటిని రోజూ తీసుకోవడంతో ఆరోగ్యకరమైన ఎముకల బలానికి కావాలిసిన కాల్షియం,పొటాషియం వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కళంగా అందుతాయి. కావున మీరు కూడా విటమిన్ డెఫిషియెన్సీ తో బాధపడుతూ ఉంటే,పైన చెప్పిన డ్రైఫ్రూట్స్ లో ఏదో ఒకటి తినడం అలవాటు చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: