ప్రస్తుత రోజుల్లో మారిన ఆహారపు అలవాట్లు, అలాగే వాతావరణం లో కలిగే మార్పులు ఇవన్నీ కూడా మన ఆరోగ్యం పై ఖచ్చితంగా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.. ముఖ్యంగా ఈ చలికాలంలో చాలా రకాల వ్యాధులు  వస్తూనే ఉంటాయి. అయితే కొన్ని రోగాలకు మన వంటింట్లోనే దొరికే వాటితో నయం చెయ్యొచ్చు.. మన వంట గదిలో దొరికే వాటిలో వెల్లుల్లి  ఒకటి.. ఈ నల్ల వెల్లుల్లిని తీసుకోవడం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. వీటిని ఎలా తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ నల్ల వెల్లుల్లి గురించి మనలో చాలా మందికి తెలియదు. ఇది  కూడా కేవలం ఒక సాధారణమైన వెల్లుల్లే. ఈ వెల్లుల్లి చూడడానికి నల్లగా ఉంటుంది. మనం వాడే వెల్లుల్లిని పులియబెట్టి ఈ వెల్లుల్లుని తయారు చేస్తారు. కిణ్వ ప్రక్రియ ద్వారా ఈ నల్ల వెల్లుల్లిని తయారు చేస్తారు.


ఇందులో జరిగే మెయిలార్డ్ ప్రతిచర్య, కారమెలైజేషన్ వల్ల వెల్లుల్లి రుచి, వాసన, ఘాటు తగ్గుతుంది. ఇక వాటిలాగే వీటిలో కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఈ వెల్లుల్లిలో ఎస్ అల్లైల్ సిస్టీన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.ఇవి శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడి కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. నల్ల వెల్లుల్లిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది..ఈ నల్ల వెల్లుల్లిని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. గుండె ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది.. ఇంకా అంతేకాదు క్యాన్సర్ వంటి ప్రాణాంతర వ్యాధులతో కూడా ఇది పోరాడుతుంది.. నల్ల వెల్లుల్లిని సలాడ్స్, సూప్స్ ఇంకా టోస్ట్ వంటి వాటితో తీసుకోవచ్చు. ఇది రుచికి తీయ్యగా ఉంటుంది.దీన్ని మనం నమిలి కూడా తినవచ్చు..ప్రతి రోజూ ఉదయం నాలుగు రెబ్బలు తింటే ఖచ్చితంగా ఎన్నో మంచి ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: