మలబద్దకం వల్ల కడుపులో నొప్పి, గ్యాస్, కడుపు ఉబ్బరం, ఆకలి లేకపోవడం వంటి ఇతర సమస్యలు ఈజీగా తలెత్తుతాయి. అయితే మనలో చాలా మంది కూడా ఈ సమస్య నుంచి బయటపడడానికి  మందులను, సిరప్ లను వాడుతూ ఉంటారు. అయితే వీటికి బదులుగా కొన్ని టిప్స్ వాడడం వల్ల  మలబద్దకం సమస్యను చాలా సులభంగా తగ్గించవచ్చు.  మలబద్దకం సమస్యను తగ్గించే టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్దకం సమస్యతో బాధపడే వారు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను ఇవ్వాలి. తృణ ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను ఎక్కువగా ఇవ్వాలి.రోజుకు రెండు సార్లు పాలను ఆహారంగా తీసుకోవాలి. రోజూ ఉదయం గోరు వెచ్చని పాలను తాగాలి. అలాగే రాత్రంతా నానబెట్టిన ఎండుద్రాక్షను తీసుకోవాలి. అదే విధంగా రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో అర టీ స్పూన్ ఆవు నెయ్యి కలిపి తాగాలి. ఇలా చేయడం మలబద్దకం సమస్య సులభంగా తగ్గుతుంది. అలాగే  ఉడికించిన ఆహారాన్ని ఎక్కువగా తినాలి.


కేవలం సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను తినాలి. జంక్ ఫుడ్ ను, స్నాక్స్, పంచదార ఉండే ఆహారాలను తినడం తగ్గించాలి.హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, నిమ్మకాయనీరు వంటి వాటిని ఇవ్వాలి. తగినంత నీరు తాగడం వల్ల మలబ్దదకం సమస్య తగ్గుతుంది. అలాగే వారికి ప్రోబయోటిక్స్ తో కూడిన పెరుగును తినాలి.ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి.ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే వారు రోజూ ఒకే సమయంలో మలవిసర్జనకు వెళ్లేలా అలవాటు చేసుకోవాలి.అలాగే మలవిసర్జన సమయంలో ఫోన్స్ వాడకుండా చూసుకోవాలి. ఇలా అలవాటు చేయడం వల్ల మలబద్దకం సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది.ఆపిల్స్, అరటిపండ్లు, స్ట్రాబెర్రీ వంటివాటితో స్మూతీలను తయారు చేసుకొని తాగాలి. ఇలా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ప్రేగుల్లో కదలికలు ఎక్కువగా ఉంటాయి. మలవిసర్జన చాలా సులభంగా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: