మనం ఇప్పటిదాకా ఎన్నో రకాల ఫుడ్స్ గురించి విని, చూసి, తినే ఉంటాం. కానీ ఇప్పుడు మనం చెప్పబోయే ఫుడ్ గురించి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఈ ఫుడ్‌ని నాచుతో తయారు చేస్తారట.దీని పేరే స్పైరులనా. ఇక ఇది సముద్రపు నీటిలో పెరిగే నాచు జాతికి చెందిన మొక్క. ప్రస్తుతం వీటికి అన్ని చోట్లా చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే వీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.మరి వీటి ప్రయోజనాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.దీనివల్ల కండరాలు బలంగా ఉంటాయి.కండరాల అలసటను తగ్గించడంలో స్పైరులీనా సహాయ పడుతుంది. మెరుగైన కండరాల బలం, ఓర్పును ఇవ్వడంలో మంచి ఫలితాలు ఇస్తుంది. అదే విధంగా కండరాల నొప్పులు, వాపును దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు.ఈ స్పైరులినాలో క్యాన్సర్‌ నిరోధక లక్షణాలు ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలో వివిధ రకాల క్యాన్సర్‌ కణితుల పరిమాణం తగ్గించడంలో స్పైరులినా మంచి ప్రభావం చూపించిందన్నారు.


ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు.. క్యాన్సర్‌కు కారణం అయ్యే మంటతో పోరాడతాయి.తరచుగా స్పైరులినా తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే ఖనిజాలు.. తెల్ల రక్త కణాలు, ప్రతి రోధకాల ఉత్పత్తిని పెంచుతాయని పలు పరిశోధనలు నిరూపించాయి. ముఖ్యంగా వ్యాధుల బారిన పకుండా.. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తుంది.మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో స్పైరులినా ముఖ్య పాత్ర వహిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఓ అధ్యయనం ప్రకారం.. ప్రతి రోజూ ఒక గ్రాము స్పైరులినా తీసుకుంటే.. మూడు నెలల తర్వాత చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ గణనీయంగా తగ్గుతుంది.కాపర్, ఐరన్, ఓమేగా 6, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, బీటా కెరోటిన్, ఫైకోసైనిన్, థయామిన్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్, విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి. ఇది ప్రతి రోజూ ఒక స్పూన్ తింటే.. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: