శీతాకాలంలో ఖచ్చితంగా చాలా ఆరోగ్యంగా ఉండాలి.ఎందుకంటే ఈ కాలంలో మానసికంగా ఇంకా శారీరకంగా చాలా అనారోగ్యాలకు గురవుతారు. ఈ కాలంలో చాలా మంది కూడా ఒత్తిడికి లోనవుతుంటారు. అందుకే మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పుస్తకాలు చదవడం, ఇష్టమైన సంగీతం వినడం, ప్రియమైన వారితో గడపడం వంటికి మనసుకి ఉల్లాసాన్ని ఇస్తాయి. మీ పనులు, బాధ్యతలు ఏ విధంగా నిర్వర్తింటారో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం కూడా అంతే అవసరం. ఈ సీజన్‌లో బిజీగా జీవితం గడిపేవారికి సవాలుగా చెప్పాలి. చురుకుగా ఉండటం, సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, హైడ్రేటెడ్‌గా ఉండటం, వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడం ద్వారా శీతాకాలంలో సైతం ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించవచ్చును.చలికాలంలో నిద్ర చాలా అవసరం. ఖచ్చితంగా ప్రతిరోజు 7 నుంచి, 8 గంటలు నిద్రపోవాలనే లక్ష్యంగా పెట్టుకోండి. అలాగే చలికాలంలో కేలరీలు తక్కువగా ఉండే ఆహారం తినడం మంచిది. ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని తీసుకోండి.


బయట వాతావరణం చల్లగా ఉండటంతో చాలామంది మంచినీరు తాగడం మానేస్తారు. దాంతో డీహైడ్రేషన్‌కి గురవుతారు. వేసవికాలంలో మాత్రమే కాదు శీతాకాలంలోనూ కావాల్సినంత నీరు తీసుకోకపోతే డీహైడ్రేషన్ సమస్య ఎదురవుతుంది. రోజులో కనీసం 8 గ్లాసుల నీరు తీసుకోండి. హెర్బల్ టీ, వేడి పానీయాలు మరింత హెల్ప్ చేస్తాయి.ఇక శీతాకాలంలో కొందరి లైఫ్ స్టైల్ మారిపోతుంది. లేజీగా ఉండటం, చురుగ్గా ఏ పని చేయలేకపోవడం, చేసే పని మీద శ్రద్ధ లేకపోవడం వంటి బ్యాడ్ హ్యాబిట్స్ మొదలవుతాయి. ఇవన్నీ శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఈ సీజన్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ వదిలిపెట్టాలి. అందుకోసం మనల్ని మనం ఉత్సాహంగా మార్చుకోవాలి. ఉదయాన్నే యోగా, లేదా డ్యాన్స్ క్లాసులు మనసుకి ఉల్లాసాన్ని, శక్తిని ఇస్తాయి. అలాగే మార్నింగ్ వాక్.. జాగింగ్ కూడా మంచివి. ఈ సీజన్‌లో చేసే శారీరక వ్యాయామం మనసుని ఉత్తేజపరిచి చురుగ్గా ఉంచుతుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ కాలంలో ఈ అలవాట్లు పాటించండి. ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: