మన బాడీలో రక్త కణాలు తయారవ్వాలన్నా ఇంకా అలాగే హిమోగ్లోబిన్ శాతం ఎక్కువగా ఉండాలన్నా ఐరన్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. అందుకే రక్తం తక్కువగా ఉన్నవారికి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. ఇంకా అలాగే ఐరన్ ఎక్కువగా ఉండే సిరప్స్, క్యాప్సుల్స్‌ని ఇస్లారు.అయితే ఇలా మందులు వాడటం కంటే న్యాచురల్ గా బాడీలో రక్తాన్ని తయారు చేసుకోవచ్చు. అయితే ఇందుకు ఎక్కువగా ఐరన్ శాతం ఉన్న ఫుడ్స్ తింటే సరి పోతుంది.అయితే ప్రతి రోజూ మన శరీరానికి 30 మిల్లీ గ్రాముల ఐరన్ అనేవి అవసరం పడుతుంది.అవిసె గింజల్లో కూడా ఐరన్ శాతం అనేది ఎక్కువగా లభిస్తుంది. 100 గ్రాముల అవిసె గింజల్లో 100 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మరింత త్వరగా రక్త హీనత సమస్య నుంచి బయట పడొచ్చు. వీటిని లడ్డూల్లా, కారం పొడిలా చేసుకుని తీసుకోవచ్చు. పిల్లలకు ఇస్తే చాలా మంచిది. ఇవి తినడం వల్ల ఐరన్ పడటమే కాకుండా.. ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి.అదే విధంగా తవుడులో కూడా ఐరన్ శాతం అనేది లభిస్తుంది.


100 గ్రాముల తవుడులో 45 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. తవుడును నురుగా తినడం కాని వారు.. లడ్డూలను తయారు చేసుకుని తినొచ్చు. ఇలా చేయడం వల్ల త్వరగా రక్త హీనత సమస్య నుంచి బయట పడొచ్చు.మనలో చాలా మంది క్యాలీ ఫ్లవర్‌ వండుకునేటప్పుడు.. వాటి కాడలు పడేస్తూ ఉంటారు. క్యాలీ ఫ్లవర్‌ కాడల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిల్లో 40 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. కాబట్టి వీటిని పడేయకుండా చూసుకోండి. ఇలా క్యాలీ ఫ్లవర్ కాడలను పడేకుండా ఆహారంలో తీసుకుంటే ఐరన్ లభిస్తుంది.అలాగే తోట కూరలో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి తోట కూరను ఆహారంలో భాగంగా తీసుకుంటే సోడియంతో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. అదే విధంగా జీర్ణ వ్యవస్థ కూడా మెరుగు పడుతుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఇలా తోట కూరను తీసుకోవడం వల్ల శరీరానికి ఐరన్ లభించడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. 100 గ్రాముల తోటకూరలో 39 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: