ఈ కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ బీపీ సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యుక్తవయసులో ఉన్న వారు బీపి సమస్య బారిన ఎక్కువగా పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. బీపీ కారణంగా గుండెపోటు, మూత్రపిండాల వైఫల్యం, పక్షవాతం లాంటి అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఇక బీపీ ని సైలెంట్ కిల్లర్ గా వైద్యులు అభివర్ణిస్తూ ఉంటారు. అంతేగాక ఇది క్రమంగా శరీర ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. చాలా మంది ఈ సమస్యకు మందులు వాడినప్పటికి అది అదుపులో ఉండదు.చాలా మంది బీపి సమస్యను చిన్న సమస్యగా భావించి దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అయితే ఈ బీపీ సమస్య చిన్న సమస్య కాదని దీనిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీపీ కారణంగా మనం చాలా ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. కాబట్టి యుక్త వయసులో ఉన్నవారు ఎప్పటికప్పుడు బీపీకి సంబంధించిన పరీక్షలు ఖచ్చితంగా చేయించుకోవాలి. చాలా మంది తమకు ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని పరీక్షలు చేయించుకోరు. కానీ ఎలాంటి లక్షణాలు కనిపించకపోయిన బీపీ సమస్యతో బాధపడే అవకాశం ఉందని కాబట్టి పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అలాగే ఈ సమస్య మొదటి దశలో ఉన్న వారు వెంటనే సమస్య తగ్గడానికి మందులు వాడడానికి బదులు సహజ సిద్దంగా లభించే ఒక పదార్థాన్ని వాడడం వల్ల బీపీ రెండు నెలల్లో ఈజీగా అదుపులోకి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.బీపీ మొదటి దశలో ఉన్న వారు యాలక్కాయలను వాడడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ ఉదయం 3 గ్రాములు, సాయంత్రం 3 గ్రాముల యాలకుల పొడిని తీసుకోవడం వల్ల రెండు నుండి మూడు నెలల్లోనే మొదటి దశలో ఉన్న బీపీ ఈజీగా అదుపులోకి వస్తుందని వారు చెబుతున్నారు. అయితే మందులు వాడే అవసరం లేకుండా యాలకుల పొడిని వాడడం వల్ల మొదటి దశలో ఉన్న బీపీ ఈజీగా అదుపులోకి వచ్చిందని వైద్యులు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. ఇంకా అలాగే బీపీ అదుపులోలేని వారు రోజూ ఉదయం రెండు యాలకులను, సాయంత్రం రెండు యాలకులను తీసుకోవడం వల్ల బీపీ అదుపులోకి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా బీపీని తగ్గించడంలో యాలకులు మనకు చాలా బాగా సహాయపడతాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: