![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/health/movies_news/night-eating-danger0feaa151-3c0e-410a-ae03-3151fa7a1e44-415x250.jpg)
కానీ ఈ మధ్య కొంతమంది ఆరోగ్యంపై అవగాహన కలిగి డైట్ లు పాటిస్తూ ఉన్నారు.అందులోనూ మన ఆరోగ్యానికి చాలా ఆవశ్యకమైన పదార్థాలను తింటూ సన్నబడుతూ ఉంటారు కూడా.కానీ ఈ డైట్ రూపంలో తీసుకునే ఆహారాల్లో కొన్ని రకాల ఆహారాలను నైట్ టైమ్స్ అసలు తినకూడదని ఆహారనిపుణులు చెబుతున్నారు.వీటి వల్ల ఆరోగ్యం ఏమో కానీ, అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని హెచ్చరిస్తున్నారు కూడా.మరి అవేంటో మనము తెలుసుకుందాం పదండి..
పెరుగు..
సాధారణంగా మధ్యాహ్నం పూట భోజనం సమయంలో మాత్రమే ఎక్కువగా పెరుగు తీసుకోవడానికి ట్రై చేయాలి.రాత్రిపూట పెరుగుతో తినడం వల్ల ఇందులోనే ప్రోబయాటిక్ సరిగా జీర్ణం కాక కడుపులో గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను కలిగించడమే కాకుండా, ఇందులో చలువ చేసే గుణాల వల్ల జలుబు,దగ్గు,జ్వరం వంటివి కూడా తెప్పిస్తుంది.కావున ప్రతి ఒక్కరు రాత్రిపూట పెరుగుదలను అవాయిడ్ చేయడం చాలా మంచిది.
డ్రై ఫ్రూట్స్..
డ్రై ఫ్రూట్స్‌లో కార్బోహైడ్రేట్లు,చక్కెర,విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు పుష్కళంగా లభిస్తాయి.ఇవి ఉదయాన్నే తింటే ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి కానీ సాయంత్రం లేదా రాత్రి సమయంలో తీసుకుంటే మాత్రం కడుపు ఎంజైమ్‌లు వాటిని విచ్ఛిన్నం చేయలేవు.దీనితో తీవ్రమైన జీర్ణ సమస్యలకూడా కారణమవుతాయి.కావున రాత్రి సమయంలో తేలికైన ఆహారాలు మాత్రమే తినాలి.లేదంటే నిద్ర మాత్రం పట్టదు.
అధిక కొవ్వులు..
రాత్రి సమయంలో కొవ్వు పదార్ధాలను తినడంతో మన జీర్ణవ్యవస్థ దానిని జీర్ణం చేయడానికి రాత్రిపూట ఎక్కువసేపు పని చేయాల్సి వస్తుంది.దీంతో పొట్టలో ఇబ్బంది కలిగించి,నిద్రకు భంగం కలిగేలా చేస్తుంది.అందుకే రాత్రిపూట కొవ్వు పదార్థాలకూ దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.కావున మీరు కూడా రాత్రి పూట పైన చెప్పిన పదార్థాలను తినే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి.