ఈ రోజుల్లో అసలు వయసుతో సంబంధం లేకుండా కంటి సమస్యను అందరూ ఎదుర్కొంటున్నారు. మన కంటిచూపు ఎక్కువ కాలం పాటు దెబ్బతినకుండా ఉండాలంటే మన కంటిలో ఉండే రెటీనా ఆరోగ్యం బాగుండాలి. రెటీనా ఆరోగ్యం బాగుండాలంటే రెటీనాకు ముఖ్యమైన పోషకాలు అందించాలి. చాలా మంది విటమిన్ ఎ అందితే కంటిచూపు బాగుంటుంది అని అనుకుంటారు కానీ విటమిన్ ఎ తో పాటు ఇతర పోషకాలు కూడా ఎంతో అవసరమవుతాయి. రెటీనా ఆరోగ్యాన్ని మెరుగుపరిచి కంటిచూపును పెంచే పోషకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కంటిచూపును మెరుగుపరచడంలో విటమిన్ ఎ కూడా ఎంతో అవసరం. రంగులను చక్కగా గుర్తించేలా చేయడంలో, రేచీకటి రాకుండా కాపాడడంలో విటమిన్ ఎ మనకు దోహదపడుతుంది. విటమిన్ ఎ ఎక్కువగా మునగాకు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వంటి వాటిలో ఉంటుంది. ఈ ఆకులను తీసుకోవడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. ఈ విధంగా ఈ ఏడు రకాల పోషకాలను తీసుకుంటూనే కంటికి తగినంత విశ్రాంతి ఉండేలా చూసుకోవాలి. చిన్న చిన్న అక్షరాలను చదవడం, సెల్ ఫోన్స్ ఎక్కువగా చూడడం, కంటిపై వెలుతురు ఎక్కువగా పడడం వల్ల కణాలల్లో ఆక్సీకరణ ఒత్తిడి పెరిగి వేడి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కంటిచూపు తగ్గుతుంది. రోజూ రాత్రి 7 నుండి 8 గంటల పాటు ఖచ్చితంగా నిద్రపోవాలి.


అలాగే కంటిచూపును మెరుగుపరచడంలో విటమిన్ సి, విటమిన్ ఇ కూడా మనకు సహాయపడతాయి. కంటి రెటీనాలో 10 లేయర్స్ ఉంటాయి. ఈ లేయర్స్ లో ఉండే కణాల  డిఎన్ఎ దెబ్బతినకుండా కాపాడడంలో ఈ పోషకాలు మనకు దోహదపడతాయి. డిఎన్ఎ దెబ్బతినడం వల్ల కణాలు దెబ్బతింటాయి. కణాలు దెబ్బతినడం వల్ల రెటీనాలో ఉండే లేయర్స్ దెబ్బతిని కంటిచూపు తగ్గుతుంది. కనుక కంటి ఆరోగ్యానికి విటమిన్ సి, ఇ కూడా చాలా అవసరం. విటమిన్ సి ఎక్కువగా జామకాయల్లో, విటమిన్ ఇ ఎక్కువగా పొద్దు తిరుగుడు గింజల్లో ఉంటుంది.వీటిని తీసుకోవడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది.కంటి లోపలి కణాలను దెబ్బతినకుండా ఆక్సీకరణ ఒత్తిడి నుండి వాటిని కాపాడడంలో జింక్, లూటిన్, జ్గియోస్కాంథిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అవసరమవుతాయి. ఇవి గుమ్మడి గింజలల్లో, జనపనార విత్తనాల్లో ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల జింక్, లూటిన్, జ్గియోస్కాంథిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అంది కంటిచూపు మెరుగుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: