ఈ మధ్యకాలంలో చాలామంది స్త్రీలకు పీరియడ్ అంటేనే దడపుడుతూ ఉంది.దీనికి కారణం ఈ సమయంలో అధిక రక్తస్రావం కావడం,లేక పది పదిహేను రోజులకి పీరియడ్ రావడం,అలా పీరియడ్ వచ్చిన సరే ఎక్కువ పొట్ట నొప్పిగా ఉండడం,కాళ్లు చేతులు లాగడం, ఏ పని మీద దృష్టి వల్లకపోవడం,మూడు స్వింగ్స్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.ఇలాంటి సమస్యలు మన జీవనశైలి,హార్మోనల్ ఇమ్బాలెన్స్, ఆహారపు అలవాట్లు కారణంగా వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్న ప్రతి స్త్రీ గైనకాలజిస్ట్స్ అలా సహాయంతో అప్పటికప్పుడు బయటపడుతున్న, తిరిగి మరీ ఆ సమస్యలు మొదలవుతూ ఉంటాయి. ఇలా రసాయనికంగా తయారు చేసే మందులను కాకుండా,మన ప్రకృతిలో ఈజీగా లభించే గోంగూరతో ఇలాంటి సమస్యలన్నిటిని ఒకే సిప్పులో పారద్రోలుచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు.మరి ఆ గోంగూర కషాయం వల్ల ఉపయోగాలు ఏంటో,అది ఎలా తయారు చేసుకోవాలో మనము తెలుసుకుందాం పదండి..

సాధారణంగా గోంగూరను తరచూ తీసుకోవడం వల్ల అధికంగా ఉన్న ఐరన్ మరియు పోలిక్ యాసిడ్ ప్రోటీన్, మంచి కొవ్వు కార్బోహైడ్రేట్,భాస్వరం,ఐరన్,కెరోటిన్, రిబోఫ్లావిన్,విటమిన్ సి,పాల్మిటిక్ యాసిడ్,ప్రధాన అసంతృప్త కొవ్వు ఆమ్లాలు లినోలెయిక్ ఆమ్లం మరియు ఒలేయిక్ ఆమ్లం వంటివి పుష్కలంగా లభిస్తాయి.
 ఈ కషాయం తయారు చేయడానికి ముందుగా ఒక గ్లాస్ నీటిలో గుప్పెడు గోంగూర ఆకులను వేసి,బాగా మరిగించాలి. ఇలా గోంగూర బాగా వుడికి,కలర్ మారిన తర్వాత దింపి చల్లారనివ్వాలి.దీనిలో ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ నిమ్మరసం కలిపి రుతుక్రమణ సమయంలో రోజుకు ఒకసారి 100 ml మోతాదులో తీసుకోవాలి.దీనితో ఇందులో పాలీఫెనాల్స్,యాంటీ స్పాస్మోడిక్ లక్షణాలు ఉండడంతో మీరు
రుతుక్రమణ సమస్యలకు తొందరగా ఉపశమనం కలుగుతుంది.

అంతేకాక దీనిని తరుచూ తీసుకోవడంతో రోగనిరోధక శక్తి పెరిగి,సీజనల్ రోగాలు రాకుండా ఉంటాయి. మరియు జీర్ణ సమస్యలు,జుట్టు సమస్యలకు కూడా చెక్ పెడుతుంది.కావున మీరు కూడా పీరియడ్ సమస్యలతో బాధపడుతూ ఉంటే,వెంటనే ఈ గోంగూర కషాయాన్ని తప్పకుండా వాడి చూడండి.మరియు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

మరింత సమాచారం తెలుసుకోండి: