మన శరీరంలో కిడ్నీలని చాలా ముఖ్యమైన అవయవాలుగా చెప్తారు. ఎందుకంటే రక్తం నుండి వ్యర్థాలను, టాక్సిన్‌లను ఫిల్టర్ చేసి.. వ్యర్థాలను బయటకు పంపించే ముఖ్యమైన విధి నిర్వహిస్తుంది. ఈ మూత్ర పిండాలు సరిగ్గా పని చేయకపోతే.. వ్యర్థాలు బయటకు రాకుండా శరీరంలోనే ఉండి పోతాయి. దీంతో అనారోగ్య సమస్యల ముప్పు తప్పదు. ప్రస్తుతం మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది కిడ్నీపై ప్రెజర్ పడుతుంది. దీంతో అవి ఒత్తిడికి గురై, పలు వ్యాధులకు దారి తీస్తుంది. అందుకే ముందుగానే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడం అవసరం. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఖచ్చితంగా ఈ పనులు చెయ్యాలి.కిడ్నీలు ఆరోగ్యంగా పని చేయాలంటే విటమిన్ బీ6 ఉన్న ఆహారాలు శనగలు, లివర్, చేపలు, బంగాళ దుంపలు, మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోకూడదు.


చాలా మంది మూత్రాన్ని గంటల తరబడి ఆపుకుంటూ ఉంటారు. దీని వల్ల కిడ్నీలపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. దీంతో కిడ్నీలు దెబ్బతింటాయి.ప్రతి రోజూ వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. సరైన సమయంలో ఆహారం తినాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల కిడ్నీలు చురుగ్గా పని చేస్తాయి.పెయిన్ కిల్లర్స్ వంటి మందులను ఎక్కువగా ఉపయోగించకూడదు. దీని వల్ల కిడ్నీపై ఒత్తిడి పెరుగుతుంది. సరైన విధంగా నిద్ర ఉండేలా చూసుకోండి. మెరుగైన నిద్ర వల్ల పలు సమస్యలు రాకుండా ఉంటాయి.ఉప్పు ఉన్న ఆహార పదార్థాలు కానీ, ఆహారాలు తగ్గించేయాలి. సాధ్యమైనంత వరకు ఉప్పును తక్కువగా తీసుకోవాలి. ఉప్పు వల్ల కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంది.కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలన్నా.. వాటి విధి సరిగ్గా నిర్వహించాలన్నా నీరు చాలా అవసరం. కాబట్టి నీటిని తరచూ తాగుతూ ఉండాలి. కనీసం ప్రతి రోజూ మూడు లీటర్ల నీటిని అయినా తాగాలి. గ్యాస్, సోడా, కెఫిన్ వంటి వాటికి దూరంగా ఉండటం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: