అయితే దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే.. పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయాలా వద్దా అనేది ఇక ఆ జంట నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇద్దరు కోరుకుంటే పీరియడ్స్ సమయంలో సెక్స్ లో పాల్గొనవచ్చు. అయితే పీరియడ్స్ సమయంలో సెక్స్ విషయంలో కొన్ని నిబంధనలో పాటించాలని చెబుతున్నారు. పీరియడ్స్ సమయంలో శృంగారంలో పాల్గొన్నప్పుడు వ్యక్తిగత శుభత అనేది చాలా ముఖ్యమట. మహిళలకు సమయాన్ని బట్టి సెక్స్ కోరికలు మారుతాయట. ఏ సమయంలో ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ సమయంలోనే సెక్స్ పాల్గొనాలని నిపుణులు సూచిస్తున్నారు. బలవంతమైన శృంగార కలయికకు దూరంగా ఉండాలట.. లేదంటే అధిక రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుందట.
సమయంలో సెక్స్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయట. ఆ సమయంలో శృంగారంలో పాల్గొనడం వల్ల ఆక్సిటోసిన్, ఎండోమార్నిన్ హార్మోన్లు రిలీజ్ అవుతాయట. దీనివల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపునొప్పి తిమ్మిర్లు వెన్నునొప్పి కాళ్ళు నొప్పులు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందెందుకు అవకాశం ఉంటుందట. మరి ముఖ్యంగా అధిక రక్తస్రావంతో బాధపడేవారు.. ఈ సమస్య నుంచి విముక్తి పొందూతారట. అయితే ఈ సమయంలో ఎక్కువగా మహిళే శృంగారంలో పాల్గొనడానికి ఇష్టపడతారట. పీరియడ్స్ సమయంలో వారిలో రిలీజ్ అయ్యే హార్మోన్లు ఇందుకు కారణమట. పీరియడ్స్ సమయంలో మహిళలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అలాంటి సమయంలో సెక్స్ వారికి రిలీఫ్ ని ఇస్తుందట. అయితే పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయాలా వద్దా అనేది వారి ఆరోగ్యం, జంటల ఆసక్తి పై ఆధారపడి ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు.