
ఇటీవల నిర్వహించిన పరిశోధనలో ఏడవటం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది అని తేలింది. బహిరంగంగా నవ్వడం ఆరోగ్యానికి ఎంత మంచిదో బహిరంగంగా ఏడవడం కూడా అంతే మంచిది అంటారు. వినడానికి కాస్త వింతగా అనిపిస్తున్న ఇది నిజం అంటున్నారు నిపుణులు. కనీసం వారానికి ఒక్కసారైనా ఏడిస్తే ఎంతో మంచిది అని చెబుతూ ఉన్నారు అని చెబుతున్నారు. ఏడుపు అనేది ఒత్తిడిని తగ్గించే మందులా పనిచేస్తుందట. బాధాకరమైన పాటలు వినడం, ఏడ్చే సినిమాలు చూడటం లేదంటే విచారకరమైన పుస్తకాలు చదవటం వంటివి చేయడం వల్ల మన శరీరంలోని పారాసింతపెటిక్ నాడి చురుగ్గా మారుతుంది.
ఇక దీని కారణంగా హృదయ స్పందన మందగిస్తుందట. ఇక మెదడుపై ఓదార్పు ప్రభావం ఏర్పడుతుందట. ఇలాంటి పరిస్థితుల మధ్య వారానికి ఒకసారి ఏడ్చినట్లైతే మీరు చాలా కాలం పాటు నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుందట. అయితే ఎక్కువగా సెంటిమెంటల్ ఓరియంటెడ్ వీడియోలను చూడటం వల్ల కూడా మనిషి మానసిక బాధల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది అని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. అయితే ఎన్ని టాబ్లెట్స్ తీసుకున్న ఎన్ని రకాల మందులు వాడినప్పటికీ మనసులో ఉన్న బాధను పోగొట్టలేమని.. ఇక ఈ బాధ పోవాలంటే ఏడుపు ఒక్కటే మార్గమని చెబుతున్నారు. ఇలా ఏడుపు వల్ల మైండ్ స్ట్రెస్ తగ్గి ఇక ఎప్పుడూ చురుగ్గా ఉండేందుకు అవకాశం ఉంటుంది.