అయితే మొదట్లో ఇలాంటి ఉద్యోగాలతో బాగా రెస్ట్ దొరుకుతుందని ఇక ఇలాంటి ఉద్యోగం దొరకడం అదృష్టం అని అనుకునేవారు చాలామంది. కానీ ఇక ఒకే చోట గంటల తరబడి కూర్చొని ఎన్నో ఆరోగ్య సమస్యలను మాత్రం కొని తెచ్చుకుంటున్నారు అని చెప్పాలి. ఇక నేటి రోజుల్లో సాఫ్ట్వేర్ రంగం దగ్గర నుంచి సాధారణ ఉద్యోగం వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా ఇలా ఎలాంటి శారీరక శ్రమ లేకుండా.. ఒకే చోట కూర్చుని చేసే ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఇలా ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం మాత్రం ఏకంగా ప్రాణాలకే ప్రమాదం అంటూ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు అని చెప్పాలి.
అయితే ఆఫీసులో గంటలపాటు ఒకవేళ కూర్చికే అతుక్కుపోతున్నారు అంటే మీరు మిగతా వాళ్లతో పోల్చి చూస్తే కాస్త తొందరగానే మరణించే అవకాశం ఉందట. దాదాపుగా 16% మంది ఇలా ముందే మరణించే అవకాశం ఉందని తైవాన్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. గంటలపాటు ఒకే చోట కుర్చీలో కూర్చుంటే కొలెస్ట్రాల్, ఒబాసిటీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయట. కనీసం గంటకు ఓసారైనా పది నిమిషాల పాటు కుర్చీ నుంచి దూరం గా ఉంటే బెటర్ అంటూ సూచిస్తున్నారు పరిశోధకులు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులో ఎనిమిది గంటలకంటే ఎక్కువగా కూర్చోవడం ఎంతో ప్రమాదకరం అంటూ హెచ్చరిస్తున్నారు.