డిప్రెషన్.. డిప్రెషన్.. నేటి రోజుల్లో ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తుంది. కేవలం యువత మాత్రమే కాదు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు కూడా డిప్రెషన్తో బాధపడుతూనే ఉన్నారు. అనవసరమైన ఒత్తిడికి గురవుతూ చివరికి డిప్రెషన్ లోకి వెళ్లి పోతున్నారు.


నేటి టెక్నాలజీ యుగం లో ఉరుకుల పరుగుల జీవితంలోనే ప్రతి మనిషి కూడా మనుగడ సాగిస్తూ ఉన్నాడు. మనీ కోసం పరుగులు పెడుతూ ఏకంగా ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవడం లేదు అన్న విషయం తెలిసిందే. ఇక ప్రతి పని విషయం లో కూడా తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ ఉన్నాడు. దీంతో ఇలాంటి ఉరుకుల పరుగులు జీవితంలో ఒత్తిడి రోజు రోజుకు పెరిగి పోతూ ఉండడంతో చాలా మంది డిప్రెషన్ తో బాధపడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే కొంత మంది ఇలాంటి డిప్రెషన్ తోనే కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనకడుగు వేయడం లేదు.


 ఇక ఇలాంటి తరహా ఘటనలు ఎన్నో వెలుగు లోకి వస్తున్నాయి. ఇక ఇటీవల కాలం లో మనుషులందరిని వేధిస్తున్న ప్రధాన సమస్య అయిన డిప్రెషన్ను తగ్గించేందుకు వైద్యులు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను కనుగొంటూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇదే విషయం పై అమెరికా సైంటిస్టులు కూడా ఒక కీలకమైన విషయాన్ని కనుగొన్నారు.


 డిప్రెషన్ తో బాధపడే వ్యక్తుల్లో బాడీ టెంపరేచర్ ఇక సాధారణ వ్యక్తులతో పోల్చి చూస్తే కాస్త అధికంగా ఉంటుందని ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ క్రమం  లోనే డిప్రెషన్ తో బాధపడుతున్న వారిలో ఉష్ణోగ్రతను తగ్గిస్తే ఇక మానసిక ఆరోగ్యం మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది అంటూ అభిప్రాయపడ్డారు సైంటిస్టులు. 106 దేశాల్లోని ఏకంగా 20,000 మంది పై పరిశోధనలు చేసిన అనంతరం ఈ విషయాన్ని కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: