నారింజ పండు ఎక్కువగా తింటే కలిగే నష్టాలు ?

నారింజ పండు ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా విధాలుగా మేలు చేస్తుంది. అందుకే రుచికరమైన ఇంకా ఆరోగ్యకరమైన ఈ నారింజను ఎంతో ఇష్టంగా తింటారు. నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల చలికాలంలో నారింజను తినమని వైద్యులు చెబుతుంటారు.అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు నారింజ పండు తినడం మంచిది కాదు. ఇది మీ ఆరోగ్య సమస్యను మరింత తీవ్రతరం చేయవచ్చు. కాబట్టి ఎవరు నారింజ తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..


దంత సమస్యలతో బాధపడేవారు నారింజను తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దంతాలు బలహీనంగా ఉన్నవారు నారింజకు దూరంగా ఉండాలి.ఆరెంజ్ పంటి ఎనామెల్‌తో పాటు, కాల్షియం బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీంతో దంతాల ఆరోగ్యం దెబ్బతింటుంది.గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి ఉన్నవారు ఈ పండును తినడం వల్ల ప్రాబ్లం మరింత తీవ్రంగా మారుతుంది.అవసరమైన దానికంటే ఎక్కువ విటమిన్ సిని ఎప్పుడూ తినకూడదు. ఇది గుండెల్లో మంట, వాంతులు, నిద్రలేమి, గుండెపోటు వంటి సమస్యలకు కారణమువుతుంది.ఎసిడిటీతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ నారింజను తినకూడదు. ఎందుకంటే నారింజలో యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. 


కాబట్టి ఎసిడిటీతో బాధపడేవారు నారింజ పండ్లను తింటే కడుపులో యాసిడ్ పరిమాణం పెరుగుతుంది. ఇది కడుపు నొప్పిని కలిగిస్తుంది.జలుబు, దగ్గుతో బాధపడేవారు నారింజకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. నారింజలో ఆస్ట్రింజెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి జలుబు, దగ్గుతో బాధపడేవారు వీటికి దూరంగా ఉండాలి. తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు పెరిగే అవకాశం ఉంటుంది.కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు కూడా నారింజకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలో రాళ్లు ఉన్నవారిలో ఆరెంజ్ నొప్పి తీవ్రతను పెంచుతుంది. నారింజ కొందరిలో గుండెల్లో మంటను కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: