బీట్రూట్ ని ఎక్కువగా కాకుండా మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్యనిపుణలు చెబుతున్నారు. ఎక్కువగా తింటే అనారోగ్యసమస్యల బారిన పడాల్సి ఉంటుందని అంటున్నారు.దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఎంతో ప్రమాదకరం. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి అంటే అతి తక్కువగా తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మీరు బీట్‌ రూట్‌ లవర్స్‌ అయితే ఖచ్చితంగా మరింత జాగ్రతలు తీసుకోవాలి. లేదంటే అనారోగ్యసమస్యలు తప్పవని అంటున్నారు డాక్టర్లు.బీట్ రూట్ ని ఎక్కువగా తీసుకోవడం ఖచ్చితంగా ఎలర్జీ సమస్యలకు దరి తీస్తుంది. బీట్రూట్ లో అధిక షుగర్‌ స్థాయిలు కారణంగా షుగర్ ఉన్నవారు దీని అస్సలు తీసుకోకూడదు.అలాగే తక్కువ శాతం రక్తపోటు ఉన్నవారు బీట్‌ రూట్‌ ని తినకపోవడం చాలా మంచిది. దీని తీసుకోవడం వల్ల రక్తపోటు మరింత తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా బీట్‌ రూట్‌లో నైట్రేట్‌ ఎక్కువగా ఉండటం వల్ల రక్త కణాలు దెబ్బతింటాయి.బీట్ రూట్ ఎక్కువ తింటే జీర్ణవ్యస్థ కూడా దెబ్బతింటుంది.


ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బీట్‌ రూట్‌ని తక్కువగా తీసుకోవాలని ఆరోగ్యనిపుణలు చెబుతారు. దీని ఎక్కువగా తీసుకోవడం అనేది ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ఇంకా అలాగే బీట్‌ రూట్‌లో కాపర్‌, ఐరన్‌ ఇతర పోషకాలు ఉంటాయి. దీని వల్ల కాలేయం దెబ్బ తింటుంది. దీంతో పాటు ఆక్సలేట్‌ వల్ల కిడ్నీలో రాళ్లు చేరడం వంటి సమస్యలు తలెత్తుతాయి.బీట్‌ రూట్‌లో అధిక శాతం నైట్రేట్‌ ఉంటుంది. దీని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో తిమ్మిరిని కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీని జ్యూస్‌గా తీసుకోవడం వల్ల కొంతమందికి కడుపు నొప్పిని కూడా కలిగిస్తుంది.ఈ విధంగా బీట్‌ రూట్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడతామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఎక్కువగా తీసుకోకుండా మితంగా మాత్రమే తీసుకోండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: