నేటి కాలంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతున్నాయి. దీంతో చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో బాగా బాధపడుతున్నారు.మనం అధికంగా ఆల్కహాల్ ను తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ తో పాటు ట్రై గ్లిజరాయిడ్ స్థాయిలు కూడా పెరుగుతాయి.అందుకే ఆల్కాహాల్ ను మితంగా తీసుకోవడం మంచిది. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంచుకోవాలనుకునే వారు పోషకాలు కలిగిన అల్పాహారాన్ని తీసుకోవాలి. అలాగే మనం తీసుకునే ఆహరంలో మంచి కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. అవకాడో, కోడిగుడ్డు తెల్లసొన వంటి వాటిని తీసుకోవాలి. సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు నూనెలో వేయించిన ఆహారాలకు, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను విపరీతంగా పెంచుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కనుక ఫాస్ట్ ఫుడ్ కు, జంక్ ఫుడ్ కు వీలైనంత దూరంగా ఉండాలి. అదే విధంగా శరీరం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి.దీని వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడంతో పాటు రక్తనాళాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.


కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉండాలనుకునే వారు ప్రోటీన్ ను ఎక్కువగా తీసుకోవాలి. చేపలు, చిక్కుళ్లు, గింజలు వంటి వాటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను ఎక్కువగా పెంచే వాటిలో ధూమపానం కూడా ఒకటి. ధూమపానం కారణంగా హృదయ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కనుక దీనిని వదిలేయడం మంచిది. చివరగా ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి.శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడానికి అధిక బరువు కూడా ఒక ప్రధాన కారణం. మన శరీరం బరువు పెరిగితే కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా పెరుగుతాయి. కనుక సమతుల్య ఆహారాన్ని తీసుకుంటూ శరీర బరువు అదుపులో ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడిని దరి చేరకుండా చూసుకోవాలి. దీర్ఘకాలిక ఒత్తిడి శరీరంలో కొలెస్ట్రాల్ ను పెంచడమే కాకుండా గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావాన్ని కూడా చూపిస్తుంది. కనుక ధ్యానం, యోగా వంటి వాటిని చేస్తూ ఒత్తిడిని తగ్గించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: