అలాగే కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. చింతచిగురుని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఎముకలను దృఢంగా అయ్యేలా చేస్తాయి. ఎవరైనా గొంతు నొప్పి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కాస్త చింత చిగురుని తినడం వల్ల ఉపశమనాన్ని పొందవచ్చు. చింతచిగురు నీటిని వేడి నీళ్లలో మరిగించి ఆ నీటితో నోరుని పుక్కలించడం వల్ల గొంతులో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్న మటుమాయం అవుతుంది. చింతచిగురుని అప్పుడప్పుడు తినడం వల్ల కడుపులో ఉండే నులిపురుగులు కూడా నశిస్తాయి. థైరాయిడ్ తో ఇబ్బంది పడేవారు చింతచిగురుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా తినవచ్చు. ఇది థైరాయిడ్ని కూడా అదుపులో ఉండేలా ఇందులో పోషకాలు ఉంటాయి.
రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా చింతచిగురు చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ మన శరీరానికి చాలా ఉపయోగపడేలా చేస్తుంది. కాబట్టి చింతచిగురుని తినడం వల్ల జీర్ణం కూడా త్వరగా అవుతుంది గ్యాస్ మలబద్దక సమస్యలు కడుపు ఉబ్బరం ఇతరత్రా సమస్యలు ఉన్నవారు రక్తహీనతతో ఇబ్బంది పడేవారు. చింత చిగురిని కచ్చితంగా తింటూ ఉండాలి ఇందులో ఐరన్ కంటెంట్ చాలా పుష్కలంగా లభిస్తుంది.. చిన్నపిల్లలకు సైతం ఎక్కువ బలాన్ని ఇచ్చేటువంటి ఆకుకూరలలో ఇది కూడా ఒకటని చెప్పవచ్చు. అందుకే చింతచిగురు ను చాలామంది ప్రజలు మార్కెట్లో డబ్బులు ఇచ్చి కొనుక్కొని మరి తింటున్నారు.