మనం సాధారణంగా టీలో చక్కెర వేసుకొని తాగుతూ ఉంటాం. అయితే చక్కరకు బదులుగా బెల్లం వేసుకొని టీ తాగితే ఖచ్చితంగా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీలో  పంచదారకు బెల్లం వేసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఇక బెల్లాన్ని తీసుకుంటే అనారోగ్యానికి తక్కువ గురవుతారని నిపుణులు అంటున్నారు. ఇక ఇప్పుడు టీలో చక్కెరకు బదులు బెల్లాన్ని వేసుకుంటే ఎలాంటి లాభాలు కలుగుతాయో మనం తెలుసుకుందాం..గర్భిణీలకు  బెల్లం టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతీ రోజూ ఉదయం ఈ టీని తాగితే తల్లితో పాటు కడుపులో ఉన్న బిడ్డకు మేలు జరుగుతుంది.అలాగే అజీర్తి వంటి జీర్ణ క్రియ సమస్యలకు కూడా బెల్లంటీతో చెక్‌ పెట్టొచ్చు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ శారీరక సమస్యలనే కాకుండా, మానసిక సమస్యలను దరి చేరనివ్వదు.శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో బెల్లం టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతీరోజూ క్రమంతప్పకుండా బెల్లం టీ తాగితే పొట్ట, పేగులు, ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి.


ఈ టీ తాగే వారిలో మలబద్ధకం వంటి సమస్యలు కూడా రావు. ఇది జీర్ణక్రియకు మంచిది.స్త్రీలకు బెల్లం దివ్యౌషధంగా చెప్పొచ్చు. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో వచ్చే చాలా సమస్యలకు బెల్లం టీ మంచి పరిష్కారంగా చెప్పాలి. కడుపునొప్పి రావడం, తిమ్మిర్లు పట్టడం వంటివి అదుపులో ఉంటాయి.బెల్లం టీని నిత్యం తీసుకోవడం వల్ల జీవక్రియలు మెరుగువుతాయి. జీవక్రియలను వేగవంతం చేయడం వల్ల బరువు త్వరగా తగ్గేలా చేస్తుంది.బెల్లాన్ని టీలో కలుపుకొని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బెల్లంలో ఉండే క్యాల్షియం, ఐరన్, విటమిన్ బి, పొటాషియం వంటి పోషకాలు జలుబు, దగ్గు, జ్వరం వంటివి దూరమవుతాయి.బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.అందుకే బెల్లం టీ తాగడం వల్ల రక్త హీనత సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది. కాబట్టి తక్కువ రక్తం సమస్యతో బాధపడుతున్న వారు బెల్లాన్ని ఖచ్చితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: