మన ఆరోగ్యానికి  తిప్పతీగ చాలా రకాలుగా మేలు చేస్తుంది.దీంతో జ్యూస్ తయారు చేసి తీసుకోవడం వల్ల మనం చాలా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇక ఆ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి? ఇంకా దానివల్ల కలిగే ఉపయోగాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక లీటర్ నీటిలో తిప్పతీగ ఆకులు వేసి సగం అయ్యే వరకు మరిగించి తరువాత వడకట్టి ఆ కషాయాన్ని తాగవచ్చు. అలాగే మనకు మార్కెట్ లో తిప్పతీగ పొడి, తిప్ప తీగ ఆకుల జ్యూస్ కూడా లభిస్తుంది. వీటిని తీసుకున్న కూడా మంచి ఫలితం ఉంటుంది. తిప్పతీగను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.తిప్పతీగ జ్యూస్ ను తీసుకోవడం వల్ల ఊబకాయం ఉన్నవారిలో ఇన్పెక్షన్ మరింత ఎక్కువ కాకుండా ఉంటుంది. అలాగే మనం ఇన్పెక్షన్ బారిన పడినప్పుడు మన శరీరంలో టిఎన్ ఎఫ్ అల్పా వంటి కెమికల్స్ ఎక్కువగా విడుదల అవుతాయి.ఈ కెమికల్స్ ఎక్కువగా విడుదల అవుతున్న కొద్దిమన శరీరంలో ఇన్ ప్లామేషన్ పెరిగి అవయవాలు దెబ్బతింటాయి. తిప్పతీగ జ్యూస్ ను తాగడం వల్ల దీనిలో ఉండే ఔషధ గుణాలు విడుదలైన కెమికల్స్ ను నిర్వీర్యం చేయడంతో పాటు ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో కూడా తిప్పతీగ మనకు సహాయపడుతుంది.


ఈ విధంగా మన రక్షణ వ్యవస్థపై తిప్పతీగ నేరుగా పని చేసి మనకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఊబకాయంతో బాధపడే వారిలో కణాలు ఎక్కువగా ఇన్ ప్లామేషన్ కు గురి అవుతాయి. వైరస్, బ్యాక్టీరియాలు వారిపై దాడి చేసినప్పుడు వారు మరింతగా ఇన్పెక్షన్ కు గురి అయ్యే అవకాశం ఉంది.మన రక్షణ వ్యవస్థను మెరుగుపరచడంలో తిప్పతీగ మనకు ఎంతో సహాయపడుతుంది. మన శరీరంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియా, వైరస్ లను కనిపెట్టే టి హెల్పర్ సెల్స్ ను పెంచడంలో తిప్పతీగ మనకు సహాయపడుతుంది. టి హెల్పర్ సెల్స్ పెరగడం వల్ల మన శరీరంలో ప్రవేశించిన వైరస్ లను టి కణాలు వెంటనే గుర్తిస్తాయి. అలాగే మన రక్తంలో మాక్రోఫేజ్ కణాలు రక్తంలో సంచరిస్తూ ఉంటాయి. ఇవి టి కణాలు ఇచ్చిన సమాచారంతో శరీరంలోకి ప్రవేశించిన వైరస్, బ్యాక్టీరియాలను మింగి భస్మం చేస్తాయి. మాక్రోపేజ్ కణాల్లో లైసోజోమ్స్ ఉంటాయి. శరీరంలోకి ప్రవేశించిన వైరస్ లను భస్మం చేసే ప్రక్రియను ఈ లైసోజోమ్స్ కలిగి ఉంటాయి. తిప్పతీగ జ్యూస్ తాగడం వల్ల లైసోజోమ్స్ కణాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: