ఇలా తరచూ దొండకాయలు తీసుకోవడం వల్ల ఇందులో అధికంగా ఉన్న క్యాల్షియమ్, మెగ్నీషియమ్ వంటి పోషకాలు పుష్కళంగా అంది,ఎముకలు, దంతాలు దృఢంగా మారతాయి.
మరియు ఇందులో ఉన్న ఆంటీ బ్యాక్టీరియాల్ గుణాలు, విటమిన్ సి మన శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుతాయి.ఎందుకంటే మనం శరీరంలో రోగనిరోధక శక్తి ఉంటేనే కరోనా వైరస్ మరియు మామూలు సీజనల్ రోగాలకు దూరంగా ఉండవచ్చు.
ఈ కాయలను ఫైబర్ కూడా అధికంగా లభిస్తుంది.కావున దొండకాయను తరుచూ తీసుకోవడంతో జీర్ణ సమస్యలు నయం అవ్వడంతో పాటు, మలబద్ధకం ,గ్యాస్, అజీర్తి వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.
ఇందులో ఉండే అధిక పొటాషియం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరిగి,గుండె ఆరోగ్యం మెరుగ్గా తయారవుతుంది.బరువు తగ్గాలనుకునే వారు ఇది మంచి ఆహారమని చెప్పవచ్చు.అదికాక శరీరంలో ఉన్న చెడు కొవ్వు కరుగుతుంది.మరియు వీటిని తిన్న వెంటనే తక్షణ శక్తిగా మారుతుంది.
దొండకాయలో ఉండే బీటా కెరోటిన్లు యాంటీ ఆక్సిడెంట్‌గా మారి,శరీరంలో క్యాన్సర్ కారణమైన ప్రీ రేడికల్స్ పెరగకుండా చేస్తాయి.
కావున ఇన్ని పోషకాలు ఉన్న దొండకాయను ఏదో ఒక రూపంలో తీసుకుంటే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని అతిగా మాత్రం అస్సలు తీసుకోకూడదు.