![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/health/movies_news/skin885967ba-0399-4008-ad77-125dd2b8b9af-415x250.jpg)
ఇలా రక్తదానం, అవయవ దారం చేయడం చేస్తారని.. ఇలా చేయడం ద్వారా ఎంతో మంచి జరుగుతుందని అందరికీ తెలుసు. అయితే ఈ వీటితో పాటు అటు ఏకంగా చర్మదానం కూడా చేస్తారు అన్న విషయం ఎవరికైనా తెలుసా.. స్కిన్ డొనేషన్ ఏంటి కొత్తగా వింటున్నాం అని అంటారు ఎవరైనా. కానీ ఇక్కడ రక్త దానం అవయవదానం ఎలా అయితే చేస్తారో అచ్చం. అలాగే ఇక ఎంతోమంది వ్యక్తులకు స్కిన్ డొనేషన్ చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన న్యూస్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
అయితే రక్తదానం చేయాలి అనుకునే వారి దగ్గర నుంచి రక్తాన్ని సేకరించి తమ దగ్గర స్టోర్ చేసుకుని ఇక అవసరమైన వారికి అందించేందుకు ఎలా అయితే బ్లడ్ బ్యాంకులు మన దేశంలో ఉన్నాయో.. ఇక అలాగే స్కిన్ డొనేషన్ చేసే వారి కోసం కూడా ప్రత్యేకంగా 27 స్కిన్ బ్యాంకులు మన దేశంలో ఉన్నాయట. మరణించిన వారి చర్మం కూడా దానం చేసేందుకు అవకాశం ఉంటుందట చనిపోయిన 6 నుంచి 8 గంటల్లో చర్మం సేకరించాలని వైద్యులు చెబుతున్నారు. అయితే దాతలకు హెచ్ఐవి, హైపటైటిస్ బి, సి లాంటి చర్మ వ్యాధులు ఉండకూడదు అని వైద్యులు చెబుతున్నారు. ఇక ఆరోగ్యమైన వందేళ్ల వరకు కూడా చర్మం దానం చేసేందుకు అవకాశం ఉంటుందట. అప్పటికే నొప్పితో ఉన్న క్షతగాత్రులకు ఇక శరీరంలోని మరో చోటు నుంచి చర్మాన్ని తీసి చికిత్స చేయడం కంటే ఇలా వేరొకరు డొనేట్ చేసిన చర్మంతో చికిత్స అందించడం ద్వారా కాస్త ఉపశమనం ఉంటుంది అని వైద్యులు చెబుతున్నారు.