నేటి ఆధునిక యుగంలో మనిషి జీవనశైలిలో ఎన్నో రకాల మార్పులు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. రోజువారి చేసే పనుల దగ్గర నుంచి తినే ఆహారం వరకు అన్నింటిలో కూడా మార్పు వచ్చింది. అయితే ఈ మార్పు మనిషికి ఆనందాన్ని ఇస్తున్నప్పటికీ మనిషి ఆరోగ్యాన్ని మాత్రం పాడు చేస్తుంది అని చెప్పాలి. ఇక నేటి రోజుల్లో ఆహారపు అలవాట్లు అయితే ఇక ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. ఇవేవీ పట్టించుకోకుండా మనిషి ముందుకు సాగుతూనే ఉన్నాడు. చివరికి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.



 అయితే ఒకప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత షుగరు, బీపీ లాంటి ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తుంది అని అందరూ అనుకునేవారు. కానీ ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్లకు వరకు ఇలాంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఎక్కువ మందిని మన దేశంలో వేధిస్తున్న సమస్య ఏదైనా ఉంది అంటే అది షుగర్ వ్యాధి అని చెప్పాలి. షుగర్ వ్యాధి బారిన పడుతున్న ఎంతోమంది.. చివరికి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. టాబ్లెట్స్ తోనే సావాసం చేస్తున్నారు. ఇక తరచూ టెస్టులు చేయించుకుంటూనే ఉన్నారు. అయితే షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో టెస్ట్ చేయించుకోవడానికి తప్పకుండా పేషంట్స్ నుంచి రక్తం తీయాల్సిందే. ఇలా రక్తం తీసే సమయంలో పేషంట్స్ కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 ఇకనుంచి అలాంటి అవసరం లేదు. షుగర్ పేషంట్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అందింది. శరీరంలో షుగర్ లెవెల్స్ తెలుసుకోవాలంటే రక్తం తీయాల్సిన అవసరం.. ఇకనుంచి ఉండకపోవచ్చు. బెలూన్ లోకి గాలి ఊదడం ద్వారా కూడా శరీరంలో చక్కెర స్థాయిలను అంచనా వేసేలా కొత్త పరికరాన్ని హిమాచల్ ప్రదేశ్ ఐఐటి మండి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఎయిమ్స్ బిలాస్పూర్ లో 492 మంది రోగుల శ్వాస నమూనాలను తీసుకొని పరీక్షించాం. ఇక ఈ పరీక్షలలో మెరుగైన ఫలితాలను చూసాం అంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: