నీటిని మరిగించి అందులో పసుపు, సోంపూ, అల్లం ముక్క వేయాలి. 5 నుండి 7 నిమిషాలు మంట తగ్గించి మరిగించాలి. కాస్త చల్లరిన తర్వాత ఇప్పుడు దానికి తేనె, నిమ్మరసం కలపండి.గోరువెచ్చగా, కావాలంటే వేడిగా ఉండగానే తాగేయొచ్చు. దీన్ని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఈ వేడి పసుపు పానీయం తాగితే, ఫిట్‌గా ఉండవచ్చు.ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. పసుపులోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి వాపు సంబంధిత సమస్యలకు సహజ నివారణగా పనిచేస్తాయి. పసుపులోని యాంటీఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేయడంలో చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి. పసుపు నీటిలోని నిర్విషీకరణ లక్షణాలు శరీరం నుంచి విష పదార్థాలను తొలగించి, మొత్తం శుభ్రపరిచే ప్రక్రియను మెరుగుపరుస్తాయి.గ్యాస్, తిమ్మిర్లు, మంట, అజీర్ణం మొదలైన కడుపు సంబంధిత సమస్యలను కూడా మీరు తరచుగా ఎదుర్కొంటే  పసుపు మీకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. పసుపులో అనేక రకాల యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి.


ఇవి కడుపులోని చెడు బ్యాక్టీరియాను చంపి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అన్ని రకాల కడుపు సంబంధిత సమస్యలలో పసుపు ప్రయోజనకరంగా ఉండటానికి ఇదే కారణం. పసుపు నీళ్లు పెయిన్ కిల్లర్ గా కూడా పని చేస్తుంది. దీని తాగడం వల్ల తలనొప్పి, కండరాల నొప్పులు తగ్గుతాయి.పసుపులోని కర్కుమిన్ అనే పదార్థం శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. ఫ్రీ రాడికల్స్ కణాలను నష్టపరిచి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. పసుపు గాయం, కండరాల ఒత్తిడి లేదా కీళ్ల నొప్పుల నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.పసుపులోని కర్కుమిన్ మెదడులోని నరాల మార్గాలను రక్షించడానికి మెమరీ పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇన్సులిన్ సెన్సెటివీ పెరుగుతుంది. స్త్రీలల్లో వచ్చే నెలసరి నొప్పి కూడా తగ్గుతుంది.జలుబు, దగ్గు, జ్వరం, కీళ్ల నొప్పులు వంటివి రావడం సర్వసాధారణం. జలుబు, కాలుష్యం కారణంగా మన రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. కానీ జలుబు, దగ్గు వంటి వ్యాధులను నివారించడానికి ఈ వేడి పానీయం అత్యంత ప్రభావవంతమైన హోం రెమెడీగా పనిచేస్తుంది.దీనిలో మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే కర్కుమిన్, జింక్, విటమిన్ సి వంటి అంశాలు ఉన్నాయి. ప్రతిరోజూ పసుపు పానీయాన్ని తాగండి.

మరింత సమాచారం తెలుసుకోండి: