ఈ మధ్య కాలంలో నాన్ వెజ్ అంటే చికెన్ చికెన్ అంటే నాన్ వెజ్ అనేంత స్థాయిలో చికెన్ ని తింటూ వున్నారు. ఈ చికెన్ తిన్నంత ఇష్టంగా మరే నాన్ వెజ్ ఐటమ్ ను తినరు.షుగర్ తో బాధపడే వారికి చికెన్ తినడమే ఉత్తమం ఎందుకంటే ఇందులో మటన్ తో పోల్చుకుంటే తక్కువ క్యాలరీలు ఉంటాయి.మరియు ఈజీగా డైజేషన్ అవుతుంది కూడా.ఇక పిల్లలయితే చికెన్ లేనిదే ముద్ద తినడానికి కూడా అంతగా ఇష్టపడరు.ఇంత ఇష్టంగా తినే చికెన్ లో మాత్రం కొన్ని రకాల భాగాలను అస్సలు తీసుకోకూడదని,ఆ భాగాలను తరచూ తీసుకోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు కలుగుతాయని చెబుతున్నారు వైద్య నిపుణులు.అసలు చికెన్ లో ఏ ఏ భాగాలను తినవచ్చో,ఏ ఏ భాగాలను తినకూడదో మనము తెలుసుకుందాం పదండి..

తినకూడని భాగాలు..

చాలామంది చికెన్ వింగ్స్ అంటూ చికెన్ లెగ్ పీస్ లంటూ,ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.దీనితో పాటు చికెన్ స్కిన్ స్కిన్ కూడా దూరంగా ఉండాలి.ఎందుకంటే దీనిలో అనవసరమైన బాక్టీరియా మరియు క్యాలరీలు అధికంగా ఉండడం వల్ల,దీనిని అస్సలు తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే నెలలో ఒకటి రెండు సార్లు మాత్రమే తీసుకోవాలి.కానీ చాలామంది చికెన్ అంటే చాలు చికెన్ లెగ్ పీస్ లు,చికెన్ వింగ్స్ ఎక్కువగా తింటూ ఉంటారు  ఇలా తరచూ తినడం వల్ల దీర్ఘకాలిక రోగాలైన మధుమేహం,గుండె సమస్యలు,క్యాన్సర్ వంటి రోగాల బారిన పడాల్సి వస్తుంది.

కావున వీటికి బదులుగా చికెన్ లో బ్రెస్ట్ పీస్ ఎక్కువగా తీసుకోవడం ఉత్తమం.ఎందుకంటే ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి.మరి అధిక ప్రోటీన్ ఉంటుంది.దీని వల్ల జీర్ణాశయం కూడా సక్రమంగా పనిచేస్తుంది. మరియు ఎదిగే పిల్లల కోసం ఇందులోని ప్రోటీన్ చాలా బాగా ఉపయోగపడుతుంది.చికెన్ కబాబ్, ఫ్రైడ్ చికెన్ తినే బదులుగా బాయిల్డ్ చికెన్ గ్రిల్ చికెన్ తీసుకోవడం చాలా మంచిది.

కావున మీరు మరియు మీ పిల్లలు చికెన్ తినేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని తినడం చాలా ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: