బెండకాయలో విటమిన్-ఎ,సి,యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.ఇవి క్యాన్సర్, డయాబెటిస్, స్ట్రోక్, గుండె జబ్బుల వంటి దీర్ఘ కాళిక రోగలను దరి చేరకుండా, ఒక వేళ వాటి బారిన పడినా,వాటి ప్రమాదాన్ని తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి.మరియు ఇందులో అధిక మెగ్నీషియం లభిస్తుంది. దానితో కండరాలు,నరాల పనితీరును మెరుగుపరిచి,దృఢంగా ఉండటానికి సహాయపడుతుంది.
అంతే కాక బెండకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ ఉన్న ఆహారాలు జీర్ణం అయ్యేందుకు దోహద పడటమే కాకుండా ఆకలిని తగ్గించి, ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతాయి. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉన్న ఆహారం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా బాగా ఉపయోగ పడుతుంది .ఎందుకంటే వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా లభించడంతో, బెండకాయలు ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తుంది .
మధుమేహులు బెండకాయను కూరల్లో భాగంగా తీసుకోవడం కన్నా, పచ్చి బెండకాయ తీసుకోవడం అలవాటు చేసుకోవడం ఉత్తమం.ఎందుకంటే బెండకాయలు రక్తంలో గ్లూకోజ్-తగ్గించే శక్తివంతమైన కూరగాయ అని ఎలాంటి అనుమానం లేకుండా చెప్పవచ్చు.తరచూ బెండకాయలు లభించిన వారు బెండకాయ బదులుగా బెండకాయ విత్తనాలను పొడి చేసుకుని మజ్జిగలో కలిపి తీసుకోవడం చాలా ఉత్తమం. అంతేకాక తరచూపిల్లలకు బెండకాయతో తయారు చేసిన ఆహార పదార్థాలు ఇవ్వడం వల్ల వారి మెదడు పనితీరు మెరుగుపడుతుంది.దీనితో వారి జ్ఞాపకశక్తి ఆలోచన తీరు అభివృద్ధి చెందుతుంది.
కావున మీరు కానీ మీ కుటుంబ సభ్యుల్లో కానీ డయాబెటిస్తో బాధపడుతూ ఉంటే రోజు బెండకాయ తినడం అలవాటు చేసుకోవడం చాలా ఉత్తమం.