దగ్గుతో బాధపడుతున్నప్పుడు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రాణానికే చాలా ప్రమాదం. దగ్గు ఉన్నప్పుడు సాయంత్రం ఉడికించిన ఆహారానికి బదులుగా 6 గంటల లోపు పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకోవడం వల్ల ఇన్పెక్షన్ త్వరగా తగ్గి దగ్గు తగ్గుతుందని వారు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల రాత్రి పడుకున్న తరువాత దగ్గు రాకుండా ఉంటుందని దగ్గుకు కారణమయ్యే ఇన్పెక్షన్ త్వరగా తగ్గుతుందని కాబట్టి దగ్గుతో బాధపడేటప్పుడు పండ్లను, పండ్ల రసాలను చక్కగా తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఉప్పు, నూనె, పంచదార ఎక్కువగా ఉన్న వాటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గడంతో పాటు కఫం, శ్లేష్మం ఇంకా ఎక్కువయ్యి దగ్గు ఇంకా ఎక్కువవుతుందని నిపుణులు చెబుతున్నారు. దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు పంచదార, బెల్లం, చల్లటి నీరు, చల్లటి పెరుగు వంటి వాటిని తీసుకోవడం మానేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ కూడా దగ్గును మరింత ఎక్కువ చేస్తాయని వారు చెబుతున్నారు.


 పండ్ల రసాలు గొంతుకు ఎంతో హాయిగా ఉంటాయని ముఖ్యంగా నారింజ, బత్తాయి వంటి పండ్ల రసాల్లో కొద్దిగా తేనె కలిపి తీసుకోవడం దగ్గు త్వరగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కారణమయ్యే ఇన్పెక్షన్ తగ్గాలంటే మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ మరింత బలపడాలి. రోగనిరోధక వ్యవస్థ బలపడాలంటే మన శరీరానికి విటమిన్ సి, ఎ, ఇ, బి కాంప్లెక్స్ విటమిన్స్ అవసరమవుతాయి. ఈ పోషకాలు ఎంత ఎక్కువగా శరీరానికి అందితే తగ్గు అంత త్వరగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పోషకాలు ఎక్కువగా పండ్లలల్లో ఉంటాయని వీటిని తీసుకోవడం వల్ల దగ్గు మరింత త్వరగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. దగ్గుతో బాధపడుతున్నప్పుడు పండ్ల రసాలను తీసుకోవాలని వీటికి బదులుగా ఉప్పు, నూనె, పంచదార ఉన్న పదార్థాలను తీసుకోవడం మానేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: