డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి.అయితే ప్రతి రోజూ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అంటారు. కానీ అది ఏమాత్రం నిజం కాదు. అయితే వీటిని తినడానికి సరైన సమయం తెలుసుకోవటం మంచిది. డ్రై ఫ్రూట్స్ తినేముందు వాటిని రాత్రంతా నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే పొట్టు తీసి తినాలి. ఇలా చేయడం వల్ల గింజల్లో వేడి కలిగించే గుణం తగ్గుతుంది. అలాగే ఫైటిక్ యాసిడ్ ఇంకా టానిన్ విడుదల అవుతుంది. దీని వల్ల మనం వాటి నుంచి పోషకాలు గ్రహించడం సులభమవుతుంది. ఒకవేళ మీరు వాటిని నానబెట్టడం మర్చిపోతే.. డ్రై రోస్ట్‌ చేసి తినడం మంచిది. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి రోజూ 15 నుండి 25 గ్రాముల డ్రై ఫ్రూట్స్ తినవచ్చునని చెబుతున్నారు.డ్రై ఫ్రూట్స్‌ పొద్దున్నే తినడం మంచిదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేడి స్వభావం కలిగిన డ్రై ఫ్రూట్స్‌ నీటిలో నానబెట్టి, వాటి పై తొక్క తీసి తర్వాత తినాలి.


 ప్రతిరోజూ 15 నుండి 25 గ్రాముల డ్రై ఫ్రూట్స్ తినవచ్చు. కానీ, వయస్సు, ఆరోగ్య పరిస్థితిలను దృష్టిలో ఉంచుకుని తింటే మంచిది. డ్రై ఫ్రూట్స్ జీర్ణక్రియ ప్రక్రియకు మద్దతునిస్తాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో డ్రైఫ్రూట్స్‌ తినడం మంచిదని చెబుతున్నారు. లేదంటే, సాయంత్రం స్నాక్‌గా కూడా నట్స్‌ తినొచ్చని సూచిస్తున్నారు. ఇలా తింటే.. ఎక్కువగా ఆహారం తినాలనే కోరిక తగ్గుతుందని చెబుతున్నారు.డ్రై ఫ్రూట్స్‌లో విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం బలపడుతుంది. డ్రై ఫ్రూట్స్ శక్తిని కలిగి ఉంటాయి. ఇది రోజంతా మీకు శక్తిని ఇస్తుంది. కొన్ని డ్రై ఫ్రూట్స్, ముఖ్యంగా బాదంపప్పులో విటమిన్ ఇ, ఫైబర్, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఆకలి తగ్గుతుంది. నోటి అందాన్ని కాపాడుతుంది. డ్రై ఫ్రూట్స్‌లో ఉండే ప్రొటీన్లు, మినరల్స్, క్యాల్షియం శరీర కండరాలను నిర్వహించడానికి సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: