సీజన్ ను బట్టి మనకు అందుకు తగ్గట్టుగా పండ్లు కూరగాయలు వంటివి లభిస్తూ ఉంటాయి..అలా వేసవి కాలంలో లభించేటువంటి వాటిలో మునక్కాయలు కూడా ఒకటి.. ఈ మునక్కాయలను మనం ఫ్రైగా అయినా చేసుకోవచ్చు.. లేకపోతే సాంబార్ గా చేసుకొని తినవచ్చు. డైట్లో భాగంగా మునక్కాయలను చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్యమైన అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి.. మునగకాయలే కాకుండా మునగ ఆకులతో కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకులలో కూడా చాలా పోషకాలు కలిగి ఉన్నాయి.


మునక్కాయలలో ఉండేటువంటి విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి ఇమ్యూనిటీని పెంచడానికి సహాయపడతాయి. అలాగే ఇందులో ఉండే విటమిన్ ఏ, క్యాల్షియం, ఐరన్ వంటివి తీసుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి.


మునక్కాయలలో ఉండేటువంటి ఫైబర్ వల్ల అజీర్ణం మలబద్ధక సమస్యలకు సైతం నివారణగా పనిచేస్తుంది. దీంతో జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరచడానికి సహాయపడతాయి.


మునక్కాయలలో ఆకులలో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. దీనివల్ల బరువు సైతం అదుపులో ఉంచుకునేలా సహాయపడుతుంది.


మునక్కాయలలో ఉండే ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్ వంటివి.. కీళ్లనొప్పున అలర్జీ వంటి లక్షణాలను కూడా తగ్గించడానికి సహాయపడతాయి. వీటిని ప్రతిరోజు తినడం వల్ల శరీరంలో ఉండేటువంటి మంటను సైతం తగ్గిస్తాయట.



మునక్కాయలలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండాకాలం వీటిని తినడం వల్ల డిహైడ్రేషన్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు..


మునక్కాయలలో ఎక్కువగా కూలింగ్ చేసే గుణం కలిగి ఉంటుంది. అందుకే శరీరంలో అధిక చమట అలసట వంటివి తగ్గించడానికి ఉపయోగపడతాయి.


మునక్కాయలను మనం ఏవిధంగా అయినా సరే తినడం వల్ల లాభాలే ఉన్నాయి.. మునక్కాయలు తినడానికి రుచిగానే ఉండడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందించడానికి సహాయపడతాయి.. అందుకే కనీసం నెలలో ఒక్కసారైనా మునక్కాయలను తినడం మంచిదని నిపుణులు తెలియజేస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: