నేటి కాలంలో ఆహారాన్ని చాలా మంది స్పూన్ తో తింటూ ఉంటారు. అయితే స్పూన్ తో కాకుండా చేతులతో తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో చాలా మంది తినడానికి చెంచా ఉపయోగిస్తున్నారు. దీని వల్ల తిన్న ఆహారం జీర్ణం కావడం కష్టమవుతుంది. అయితే చేతులతో తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


చేతులతో తినడం వల్ల ఏకాగ్రత పెరిగి ఒత్తిడి తగ్గుతుంది. దీంతో మనసుకు ఆనందం కలుగుతుంది.వీలైనంత వరకు చేతులతో తినండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చేతుల్లో హానిచేయని బ్యాక్టీరియా ఉండడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. పర్యావరణంలోని వివిధ హానికారక సూక్ష్మజీవుల నుంచి శరీరాన్ని కాపాడుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఎప్పుడూ చెంచాతో కాకుండా చేతులతో తినండి.చేతులతో భోజనం చేయడం చాలా మందికి ఆచారం. ఇది కుటుంబం కలిసి తినడం సామాజిక కోణాన్ని మెరుగుపరుస్తుంది.మనం మన చేతులతో తినేటపుడు ఆహారం ఆకృతి, ఉష్ణోగ్రతను పసిగట్టవచ్చు. ఇది ఆహారంతో మరింత సన్నిహిత సంబంధాన్ని ఏర్పరుస్తుంది. అంతేకాదు.. మన చేతులు, కడుపు, పేగులు కొన్ని మంచి బ్యాక్టీరియాలను కలిగి ఉంటాయి. ఇవి మనల్ని వ్యాధుల నుంచి కాపాడతాయి. చెంచాతో తింటే అతిగా తినే అవకాశం ఉంది. చెంచాతో అతిగా, వేగంగా తినడం వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం కూడా ఉంది. ఇది  డయాబెటిస్‌కు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


చేతులతో ఆహారం తినేవారిలో ఆహారాన్ని చేయి తాకగానే ఙ్ఞాన నాడుల ద్వారా మెదడు, పొట్టకు సంకేతాలు చేరుతాయి. దీని వల్ల జీర్ణరసాలు, ఎంజైములు విడుదలై జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది. చేతులతో తినే సమయంలో ఆహారాన్ని నేరుగా చేతిలోకి తీసుకుని నోటిలో పెట్టుకుంటాం. అప్పుడు ముక్కుద్వారా ఆ వాసన ఆహారం రుచిని మరింత పెంచుతుంది. ఇది చెంచాతో తినేటప్పుడు అనుభవించదు.చేతులతో తినే సమయంలో ముందుగా ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకుంటాం. ఇది ఆహారం త్వరగా జీర్ణమవ్వడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. పోషకాలను బాగా గ్రహించడంలో సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: