
ముఖ్యంగా బయట విరివిగా లభ్యమయ్యే ఆంటీ బయోటిక్స్ వాడకుండా ఇంట్లో అందుబాటులో ఉండే వాటితోనే సమస్యకు పెట్టవచ్చు.. హోమ్ రెమెడీస్ ఏమిటంటే ఎక్కువగా మంచినీరు తాగాలి.. అలాగే లో దుస్తులు మంచి ఫ్యాబ్రిక్ తో చేసినవి.. ప్యూర్ కాటన్ ఉపయోగించడం తప్పనిసరి.. కొబ్బరి బోండాలు చెరుకు రసం వంటివి కూడా తీసుకోవాలి.. వేపాకును మరిగించి ఆ నీటితో యోని భాగం శుభ్రం చేసుకోవడం , స్నానం చేయడం లాంటివి చేస్తే ఇన్ఫెక్షన్స్ త్వరగా పోతాయి.. అలాగే చిన్న పెద్ద రోగాలకు తెలిసి తెలియకుండా యాంటీబయోటిక్స్ వాడకూడదు. పెరుగు, మజ్జిగను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఈస్ట్ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడవచ్చు..
ఇకపోతే ఈ సమస్య వచ్చిందని ఎలా గుర్తించాలి అనే విషయానికి వస్తే.. ఒత్తిడి ఎక్కువగా ఉండడం ప్రశాంతత లేకపోవడం మూత్రంలో మంట ఋతుక్రమంలో వివిధ రకాల రంగులలో వైట్ డిస్చార్జ్ కావడం వంటి వాటిని బట్టి ఈస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిందని గుర్తించాలి.. ఇక తర్వాత పలు జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా తగ్గిపోతుంది