డయాబెటిస్తో ఇబ్బంది పడేవారు ఈ నల్ల గోధుమలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి.. వైట్ రైస్ కు బదులుగా గోధుమ రొట్టెలను తయారు చేసుకొని తినడం వల్ల రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిలు తగ్గిపోతాయి.. నల్ల గోధుమలలో ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. ఇది రక్తహీనతతో ఇబ్బంది పడేవారికి నల్ల గోధుమలు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. వీటితో తయారు చేసేటువంటివి తరచూ తింటూ ఉండడం వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి.
నల్ల గోధుమలలో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దీనివల్ల త్వరగా జీర్ణం కూడా అవుతుందట. ఒత్తిడి డిప్రెషన్ వంటి సమస్యలకు కూడా నల్లటి గోధుమలు చెక్ పెడతాయి.. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ నల్ల గోధుమలు బెస్ట్ ఆప్షన్ ప్రతిరోజు వీటి ద్వారా చేసేటువంటివి తినడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు.
ఈ నల్ల గోధుమలు వేల సంవత్సరాల క్రితమే సాగు చేశారు ఇందులో ఎక్కువగా ప్రోటీన్స్ ,విటమిన్స్, ఖనిజాలు, ఐరన్ ,పొటాషియం, కాఫర్ వంటివి పుష్కలంగా లభిస్తాయి.. సాధారణ గోధుమలతో పోలిస్తే ఇందులో ఎక్కువగా పోషకాలు కలిగి ఉంటాయట.
నల్ల గోధుమలు క్యాన్సర్ ను కూడా నయం చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉంటుంది..
నల్ల గోధుమలతో తయారు చేసేటువంటి వాటిని కనీసం వారంలో రెండు సార్లు తింటే ఎంత ఆరోగ్యంగా ఉండవచ్చట.