మట్టి పాత్రలోని నీటిలో ఎక్కువగా ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులోని నీరు కూడా సహజంగానే ఫిల్టర్ చేస్తుంది.. ఇందులో పోరిస్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి.. దీనివల్ల కలుషితమైన మలినాలను కూడా తొలగిస్తుంది.వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా కూడా ఉంటారు.
కుండలలోని నీరు సహజంగానే చల్లగా ఉంటుంది. ఫ్రిజ్లో నీళ్ళు తాగడం వల్ల ఎక్కువగా సమస్యలు ఎదురవుతాయి. అందుకే కుండలోని నీరు తాగడం మంచిది అంటూ నిపుణులు సైతం ఎన్నోసార్లు తెలియజేస్తూ ఉంటారు.
ఫ్రిజ్లో నీరు తాగడం వల్ల శరీరంలో వేడి ఎక్కువవుతుంది. అందుకే కుండలో నీరు తాగడం వల్ల వేడి తగ్గేలా చేస్తుంది.
కుండలోని నీరు తాగడం వల్ల.. జీర్ణ సమస్యలు కూడా దూరమవుతాయి.. మట్టి కుండలు వాడడం వల్ల పర్యావరణానికి కూడా ఎలాంటి నష్టం కలగదు.. మట్టికుండలకు ఉండేటువంటి చిన్న చిన్న కణాల ద్వారా గాలి కుండలోపలికి వెళ్లి అక్కడ ఉండి నీరుని చల్లబరుస్తుందట.
మెటబాలిజం సమస్యతో ఇబ్బంది పడేవారు ఎక్కువగా బరువు పెరుగుతారు. దీని వల్ల జీర్ణక్రియ కూడా సరిగ్గా జరగదు.. అలాంటివారికి కుండనీరు చాలా మంచిదని చెప్పవచ్చు.
కుండలోని నీటిలో ఎక్కువగా ఖనిజాలు ఉండడం వల్ల ఈ నీరుని తాగితే గాయాలు త్వరగా మానిపోతాయి..
కుండలోని నీటిని తాగడం వల్ల గొంతులో ఎలాంటి సమస్యలు ఉన్న తగ్గిపోతాయి.. అందుచేతనే వర్షాకాలంలో చలికాలంలో అయినా సరే కుండలో నీటిని తాగడం మంచిదని నిపుణులు సైతం తెలియజేస్తూ ఉంటారు