వేసవికాలం వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది అవిసె గింజలే.. వీటిని వేసవికాలం వచ్చింది అంటే చాలామంది తినడానికి, తాగడానికి ఉపయోగిస్తారు.. ఈ మధ్యకాలంలో మరీ ముఖ్యంగా అవిసె గింజలను డైట్ లో కూడా చేర్చుకుంటున్నారు. పోషకాలకు పవర్ హౌస్ లాంటివి అవిసె గింజలు.. వీటిల్లో ఫాస్పరస్ , ఐరన్, మెగ్నీషియం, కాపర్ , సెలీనియం, జింక్, ఫోలేట్ , ఫైబర్, విటమిన్ బి, ప్రోటీన్ , ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ , యాంటీ ఆక్సిడెంట్ ఇలా ఎన్నో పోషకాలు మనకు అవిసె గింజల్లో ఉంటాయి.. ఆరోగ్యం విషయంలో ఇది ఒక అద్భుతమైన వనరు అని చెప్పవచ్చు.. ముఖ్యంగా అవిసె గింజలను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

ఇందుకోసం ముందుగా ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలు వేసి వాటర్ తో రెండుసార్లు శుభ్రం చేయాలి.. ఆపై గ్లాస్ నిండా వాటర్ పోసుకొని.. మూత పెట్టి రాత్రంతా నానబెట్టాలి.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టుకున్న అవిసె గింజలను నీటితో సహా తీసుకోవాలి. ఇక అవిసె గింజల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.. ఆకలి కోరికను అణిచివేస్తాయి.. అవిసె గింజలు తినడం వల్ల అధిక బరువు ఊబకాయం వంటి సమస్య ఉన్నవారు త్వరగా బరువు తగ్గవచ్చు . మీరు కూడా అధిక బరువుతో బాధపడుతున్నట్లయితే ఈ చిట్కాని పాటిస్తే చాలా చక్కని ఉపయోగాలు ఉంటాయి.

ఒక అధిక బరువే కాదు మలబద్ధకం సమస్యతో బాధపడే వారు కూడా అవిసె గింజలను తీసుకోవచ్చు..ఈ  గింజలను నీటిలో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం వల్ల అధిక బరువుతో పాటు మలబద్ధకం సమస్య కూడా దూరం అవుతుంది.. జీర్ణ వ్యవస్థ కూడా చురుగ్గా పనిచేస్తుంది. అలాగే మధుమేహం ఉన్నవారు కూడా డైట్లో వీటిని చేర్చుకుంటే రక్తంలో చక్కెర లెవెల్స్ అదుపులో వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ నీటిలో నానబెట్టడం వల్ల అవి రెట్టింపవుతాయి. రోజు తినడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది.. గుండెపోటు వంటి సమస్యలు దూరం అవుతాయి.. అలాగే రక్తపోటు, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు కూడా దూరం అవుతాయి.. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.. చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: